సుమ, అనసూయ, శ్రీముఖి, రష్మి గౌతమ్.. ఈ స్టార్ యాంకర్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? షాక్ అవ్వాల్సిందే!

First Published | Mar 7, 2023, 6:57 PM IST

ఎంటర్ టైన్ మెంట్ రంగంలో బుల్లితెర అందాల యాంకర్స్ కూడా బాగానే సంపాదిస్తున్నారు. హీరోయిన్ల తర్వాత అంతటి క్రేజ్ దక్కించుకున్న ఈ స్టార్ యాంకర్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందిన సమాచారం మేరకు ఎంత ఛార్జ్ చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సింది. 
 

బుల్లితెర యాంకర్ల గురించి  చెప్పాలంటే..  స్టార్ యాంకర్ కనకాల సుమ (Suma Kanakala)పేరుతోనే స్టార్ట్ అవుతుంది. కొన్నేండ్లుగా టీవీషోలతో అలరిస్తున్న సుమక్క గురించి ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. ఇటీవల టీవీ షోలతోనే కాకుండా సినిమా ఫంక్షన్స్, ఇంటర్వ్యూలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యింది. ఎలాంటి సినిమా ఫంక్షనైనా, ఎంతపెద్ద ఈవెంట్ అయినా ఒక్కసారి సుమక్క అడుగుపెడితే సక్సెస్ బాటలో నడవాల్సిందే. అంతటి సమయస్ఫూర్తి, నైపుణ్యం కలిగిన కలిగి సుమ ఒక్కో ఆడియో ఫంక్షన్ కు దాదాపు రూ.2 నుంచి 2న్నర వరకు ఛార్జ్ చేస్తుందని టాక్ నడుస్తోంది. ఇక టీవీ షోలు, అవార్డు ఫంక్షన్లకు మరోలా రెమ్యునరేషన్ అందుకుంటారని సమాచారం. 
 

యాంకర్స్ లలో సుమక్క తర్వాత అనసూయ భరద్వాజ్ (Aanasuya Bharadwaj)దే  రెండో ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ‘జబర్దస్త్’ షోకు యాంకర్ గా వచ్చి ప్రస్తుతం వెండితెరపై కీలక పాత్రల్లో మెరుస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. టీవీ ఆడియెన్స్ లో అనసూయకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ స్మాల్ స్క్రీన్ పై ఈ బ్యూటీ మెరిసిందంటే చాలు ఖుషీ అవుతుంటారు. తన స్కిల్స్, అందంతో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అనసూయ కూడా ఒక్కో ఈవెంట్ కు రూ.2 లక్షల వరకు వసూల్ చేస్తుందని టాక్.  కానీ, ఇటీవల సినిమాల్లో బాగా బిజీగా ఉంది. ప్రస్తుతం ‘పుష్ఫ2’,‘రంగమార్తండా’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది అనసూయ.
 


యంగ్ యాంకర్స్ లో బుల్లితెర ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam). ‘జబర్దస్త్’ యాంకర్ గా దశాబ్ద కాలం పాటు టీవీ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఈకామెడీ షోతో పాటు ఆయా అవార్డు ఫంక్షన్లను హోస్టు చేస్తూ ఉంటుంది.  ఈ బ్యూటీ కూడా ఒక్కో ఈవెంట్ కు రూ.1.5 లక్షలు ఛార్జ్ చేస్తుందని టాక్. ఇక రష్మీ టీవీలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటారు. 

బుల్లితెరపై తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ దక్కించుకున్న వారిలో యాంకర్  శ్రీముఖి (Sreemukhi) ఒకరు. అందం, చురుకుతనం, సమయస్ఫూర్తి, యాంకరింగ్ స్కిల్స్ తో టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ‘పటాస్’ షో మొదలు ఇప్పటి వరకు ఎన్నో షోలో, ఈవెంట్లు, సినీ ఫంక్షన్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే శ్రీముఖి మాత్రం ఈవెంట్ కు రూ.1 లక్ష వరకు తీసుకుంటారని టాక్. బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి అటు వెండితెరపైనా అలరిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. 
 

యాంకర్ మంజూష (Manjusha). బుల్లితెర అందాల యాంకర్లలో ఈమె పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు తనదైన శైలిలో ఈవెంట్లను నడిపించడంలో సక్సెస్ అవుతోంది. స్టార్ హీరోల సినిమాకు సంబంధించిన చిన్న ఫంక్లను యాంకర్ గా అవకాశాలు అందుకుంటూ స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. ఈవెంట్ కు రూ.50 వేల వరకు ఛార్జ్ చేస్తుందని సమాచారం. 
 

యాంకర్ శ్యామల (Shyamala)కూడా ఈవెంట్ కు ఓ రేంజ్ లోనే ఛార్జ్ చేస్తున్నారంట. ‘బిగ్ బాస్’ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి బయటకు వచ్చాక శ్యామల క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఈవెంట్ కు రూ.50 వేల పైనే వసూల్ చేస్తుందని సమాచారం. ఇటీవల సోషల్ మీడియాలోనూ శ్యామల కనిపిస్తున్నారు. శ్యామల రీసెంట్ గా సొంతింటి నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం విశేషం. 
 

యాంకర్ గా పరిచయం అయిన కొద్దిరోజుల్లోనే మంచి క్రేజ్ దక్కించుకుంది యాంకర్ దీపికా పిల్లి (Deepika Pilli). ‘ఢీ13’, ‘కామెడీ స్టార్స్’ వంటి షోలకు యాంకర్ గా వ్యవహరించింది. ప్రస్తుతం ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ షోకు యాంకర్ గా మెరుస్తూ అలరిస్తోంది. ఈ బ్యూటీ ఈవెంట్లకు రూ.50 వేలకు పైగానే ఛార్జ్ చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, యాడ్స్ పైనే ఈ బ్యూటీ సంపాదన ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. 

Latest Videos

click me!