త్రివిక్రమ్ ఆమెకి అబద్దాలు చెప్పి ఒప్పించాడా.. జరిగిందంతా బయటపెట్టిన తెలుగు హీరోయిన్

Published : May 16, 2024, 04:56 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు గమ్మత్తుగా ఉంటాయి. కేవలం సాంగ్స్ కి, రొమాన్స్ కి మాత్రమే పరిమితం కావు. హీరో తో పాటు ట్రావెల్ అయ్యేలా హీరోయిన్లని త్రివిక్రమ్ కథలో ఇన్వాల్వ్ చేస్తారు.

PREV
19
త్రివిక్రమ్ ఆమెకి అబద్దాలు చెప్పి ఒప్పించాడా.. జరిగిందంతా బయటపెట్టిన తెలుగు హీరోయిన్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు గమ్మత్తుగా ఉంటాయి. కేవలం సాంగ్స్ కి, రొమాన్స్ కి మాత్రమే పరిమితం కావు. హీరో తో పాటు ట్రావెల్ అయ్యేలా హీరోయిన్లని త్రివిక్రమ్ కథలో ఇన్వాల్వ్ చేస్తారు. అయితే కొన్నిసార్లు హీరోయిన్లకు అంతగా గుర్తింపు ఉండదు. 

29

త్రివిక్రమ్ చిత్రంతో అలాంటి చేదు అనుభవమే ఎదురైందని తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా తాజాగా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన చిత్రం ఏదో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రం. అరవింద సమేత చిత్రంలో నటించడం వల్ల చాలా బాధపడ్డాను అని ఈషా సంచలన వ్యాఖ్యలు చేసింది. 

39

ఓవరాల్ గా ఆ చిత్రంలో ఈషాకి అంతగా ప్రాధాన్యత ఉండదు. త్రివిక్రమ్ అతని టీం అబద్దాలు చెప్పడం వల్లే కన్ఫ్యూజన్ లో అంగీకరించినట్లు ఈషా రెబ్బా పేర్కొంది. అరవింద సమేత చిత్రంలో ఆఫర్ వచ్చే సమయానికి నాకు ఇంకా సరైన గుర్తింపు రాలేదు. కానీ చేస్తే లీడ్ గానే చేయాలని ఫిక్స్ అయి ఉన్నా. 

49

వాళ్ళు కథ చెప్పి ఇది సెకండ్ హీరోయిన్ పాత్ర అని చెప్పారు. అయినా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఫైనల్ అవుట్ పుట్ లో నా పాత్ర ఎంత ఉంటుంది అనేది నాకు అనుమానమే. ఇలాంటి పాత్ర చేసి ఈ చిత్రం ఫ్లాప్ అయితే నన్ను అవకాశాలు అసలు ఉండవు. ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు సపోర్ట్ చేసే వాళ్ళెవరూ లేరు. 

59

అందుకే భయపడి వద్దులేంటి ఇలాంటి పాత్రలు చేయను అని చెప్పేశా. మీ ప్రాబ్లెమ్ ఏంటి ? త్రివిక్రమ్ దర్శకత్వం, హారిక అండ్ హాసిని సంస్థ, ఎన్టీఆర్ హీరో ఇంతకి మించి ఇంకేంకావాలి అని అడిగారు. నేను లీడ్ రోల్ లోనే నటించాలని అనుకుంటున్నా అని చెప్పా. ఇందులో మీరు కూడా హీరోయిన్ కదా అని చెప్పారు. 

69

ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కథ చెప్పారు. ఆయన కూడా ఇందులో నువ్వు కూడా హీరోయినే అమ్మా అని చెప్పారు. సరే చేద్దాం అని ఒకే చెప్పా. అప్పటికి నాకు ఎక్కడో తేడా కొడుతోంది. నాకు ఒక సాంగ్ కూడా ఉందని చెప్పారు. సాంగ్ షూటింగ్ కి ముందు నేను గోవాలో ఉన్నా. 

 

79

సాంగ్ షూటింగ్ ఉందని చెబితే వెకేషన్ క్యాన్సిల్ చేసుకుని వచ్చా. తీరా వచ్చేసరికి సాంగ్ క్యాన్సిల్ అయింది. ఎన్టీఆర్ చిత్రంలో నేను నటిస్తున్నానని తెలిసే సరికి చాలా మంది ఫోన్స్ చేశారు. వామ్మో పెద్ద సినిమాలో నటిస్తే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయా. ఈ చిత్రంలో నేను సెకండ్ హీరోయిన్ అని నాకు చెప్పారు. కానీ బయట మీడియాకి చెబితే బావుండేది. కానీ మీడియాకి చెప్పలేదు. 

89
Eesha Rebba

ఎన్టీఆర్ కి హీరోయిన్ అంటే నా కెరీర్ కి చాలా బావుంటుంది కదా అని ఆశపడ్డా. మేనేజర్ ని చాలా సార్లు అడిగా అనౌన్స్ చేయమని. కానీ వాళ్ళు చెప్పలేదు. సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది ఫోన్ చేసి మీ రోల్ ఏమి లేదండి ఇందులో అని వెటకారంగా మాట్లాడారు. చాలా సీన్లు ఎడిటింగ్ లో పోయాయి. సాంగ్ కూడా లేదు. 

99

ఇలా అరవింద సమేత చిత్రంతో నాకు అన్ని బాధ కలిగించే అంశాలే జరిగాయి. ఒకే ఒక్క సంతోషం ఏంటంటే ఎన్టీఆర్ తో కలసి నటించడం. ఫ్యాన్స్ లో నాకు కాస్త గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది అని ఈషా రెబ్బా తెలిపింది. 

click me!

Recommended Stories