బన్నీ మొదట సినిమా ఆఫర్ గురించి నాగబాబు కామెంట్,షాకింగ్ మేటర్

Published : May 16, 2024, 03:57 PM IST

 ఇంకా ఇంకాస్త మెచ్యూరిటీ రావాలి. యాక్టింగ్ లో ట్రైనింగ్ కావాలి. ఆ క్యారెక్టర్ బన్నీ అయితే బాగుంటాడు. తనని చేయమన్నాడు. 

PREV
111
 బన్నీ మొదట సినిమా ఆఫర్ గురించి నాగబాబు కామెంట్,షాకింగ్ మేటర్
allu arjun,nagababu


"మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు  సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనేదానిపై ఏ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో  ఎవరికి తగినట్లుగా వారు అర్థాలు చెప్పుకుంటున్నారు. 

211


మాగ్జిమం మీడియాతో సహా చాలా మంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి నాగబాబు కోపంతో  ఈ ట్వీట్ చేశారని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేశారంటున్నారు.
 

311


ఈ గొడవలకు కారణం  ఏపీ ఎన్నికల ప్రచారం చివరిరోజు.. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వెళ్లారు. భార్యతో కలిసి నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్.. నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. అయితే అంతకు ఒక్కరోజు ముందే ట్విటర్ వేదికగా పవన్ కళ్యాణ్‌కు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు. మరుసటి రోజే శిల్పారవి ఇంటికి వెళ్లి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే విలేకర్లతో మాట్లాడుతూ శిల్పారవికి మద్దతుగా ట్వీట్ చేస్తే సరిపోదని.. అందుకే ఇంటికి వచ్చి మద్దతు ప్రకటిస్తున్నానని అన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్, పవన్ ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలైంది. 
 

411
Nagababu, allu arjun


ఈక్రమంలో నాగబాబు గతంలో అల్లు అర్జున్ గురించి ప్రస్తావిస్తూ మాట్లాడిన వీడియోలు వైరల్ చేస్తు అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.   అల్లు-మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బన్నీ తనదైన నటనతో ఇండస్ట్రీలో స్పెషల్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. తెలుగులోనే కాదు సౌత్‌ ఇండస్ట్రీల్లో సైతం విపరీతమైన క్రేజ్‌ను  సంపాదించుకున్నాడు. యలయాళంలో బన్నీని మల్లు అర్జున్‌గా ఫ్యాన్స్‌ పిలుచుకుంటారనే విషయం తెలిసిందే.

511


 అలా ఇతర భాషల్లో సైతం స్పెషల్‌ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్న అల్లు అర్జున్‌ గంగోత్రి చిత్రంతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.  తొలి చిత్రంతోనే హీరోగా సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఇక ఇందులో బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే అంతగా గుర్తింపు తెచ్చిపెట్టిన ఈ సినిమాకు బన్నీ మొదటి చాయిస్‌ కాదంటూ అసక్తికర విషయం చెప్పాడు మెగా బ్రదర్‌ నాగబాబు. 
 

611

 
ఆ మధ్యన  ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన ఆయన ఈ సందర్భంగా మెగా హీరోల గురించి ప్రస్తావించారు. తమ ఫ్యామిలీ నుంచి ఇంత మంది హీరోలు వస్తారనుకోలేదన్నారు. ‘అన్నయ్య(మెగాస్టార్‌ చిరంజీవి)ను స్ఫూర్తిగా తీసుకునే మేం ఇండస్ట్రీకి వచ్చాం. ఆయన హీరో అయ్యారు. నన్ను నిర్మాతగా మార్చారు. అలా అన్నయ్య హీరోగా ఎదిగే క్రమంలో ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతలను చూసి పిల్లలంతా ఇన్‌స్పైయిర్‌ అయ్యారు.
 

 

711

ఇండస్ట్రీలో అయితే ఎలా అన్నయ్య స్పూర్తితో బయటి వాళ్లు హీరోలు అయ్యారో. అలాగే ఇంట్లో పిల్లలు కూడా ఆయన ఇన్‌స్పిరేషన్‌తో హీరోలు అయ్యారు. అలా అయిన వాళ్లలో బన్నీ కూడా ఒకడు. బన్నీ ఫస్ట్‌ గంగోత్రి ఆఫర్‌ వచ్చింది. కానీ నిజానికి గంగోత్రి ఆఫర్‌ ఫస్ట్‌ చరణ్‌ బాబు(రామ్‌ చరణ్‌)కు వచ్చింది. చరణ్‌ బాబుని అడిగినప్పుడు అన్నయ్య వద్దు అన్నాడు. చరణ్‌కి ఇంకా ఇంకాస్త మెచ్యూరిటీ రావాలి. యాక్టింగ్ లో ట్రైనింగ్ కావాలి. ఆ క్యారెక్టర్ బన్నీ అయితే బాగుంటాడు. తనని చేయమన్నాడు. అలా బన్నీ గంగోత్రి ఆఫర్‌ వచ్చింది. అలానే అనుకోకుండానే అందరికి ఆఫర్లు వచ్చాయి, హీరోలు అయ్యారు’’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.
 

811

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  నటించిన ‘డాడీ’ (Daddy) సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun)  నటుడిగా మారాడు. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చింది ‘గంగోత్రి’ (Gangotri) సినిమాతో. కే.రాఘవేంద్రరావు (Raghavendra Rao) గారి 100 వ సినిమాగా ఈ మూవీ రూపొందింది. 2003 వ సంవత్సరం మార్చి 28 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదట ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత కే.రాఘవేంద్ర రావు గారి మార్క్ పబ్లిసిటీ, సాంగ్స్ హెల్ప్ అవ్వడంతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఫైనల్ గా సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది.
 

911


కానీ ఇందులో నటించిన హీరో, హీరోయిన్లకి పెద్దగా పేరు రాలేదు. అల్లు అర్జున్ కి మాత్రమే కాదు ఆర్తీ అగర్వాల్ (Aarthi Agarwal) చెల్లెలు అదితి అగర్వాల్ కి (Aditi Agarwal) కూడా ఇది మొదటి సినిమా. ఆమె కూడా ఈ సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె సంగతి ఎలా ఉన్నా.. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని చూసిన వారంతా అతని లుక్స్ పై విమర్శలు గుప్పించారు. కానీ భవిష్యత్తులో ఇతను పాన్ ఇండియా స్టార్ అవుతాడు అని ఎవ్వరూ ఊహించలేదు.
 

1011
Allu Arjun


అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ” ‘గంగోత్రి’ సినిమా బ్లాక్ బస్టర్ అయినా నేను దాన్ని క్యాష్ చేసుకోలేకపోయాను. ఏడాది పాటు నేను ఖాళీగా ఉన్నాను. నేను మైనస్ 100 లో ఉన్న టైంలో ‘ఆర్య’ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. మా నాన్నగారు అల్లు అరవింద్ (Allu Aravind), చిరంజీవి గారు ఓకే చేస్తే తప్ప ఆ టైంలో నేను సొంతంగా సినిమా చేయలేని పరిస్థితి. అలాంటి టైంలో దిల్ రాజు గారు సుకుమార్ (Sukumar)  అనే కొత్త దర్శకుడిని నా దగ్గరకు తీసుకొచ్చి ‘ఆర్య'(Aarya) కథ వినిపించారు.
 

1111

 నాకు బాగా నచ్చింది. ఇది నాకు ఒక ‘ఇడియట్’ లాంటి సినిమా అవుతుందనే గట్ ఫీలింగ్ ఉంది. కానీ సుకుమార్ కొత్త దర్శకుడు హ్యాండిల్ చేయగలడా లేదా అని మా నాన్నగారికి ఓ టెన్షన్ ఉంది. ఆ టైంలో వి.వి.వినాయక్ (V. V. Vinayak) గారు వచ్చి ‘ఆ కుర్రాడు బాగా తీయగలడు. అయినప్పటికీ మీకు డౌట్ ఉంటే నేను వచ్చి సినిమాని కంప్లీట్ చేస్తాను’ అనే భరోసా ఇచ్చారు. ఆ అవసరం రాకుండానే సుకుమార్ అద్భుతంగా ‘ఆర్య’ ని తీశారు. నా కెరీర్లో టర్నింగ్ పాయింట్ ‘ఆర్య’ సినిమా ” అంటూ చెప్పుకొచ్చాడు. 
 

Read more Photos on
click me!

Recommended Stories