షార్ట్ ఫిల్మ్ ఇచ్చిన బ్రేక్ తో ... వెండి తెరను ఏలేస్తున్నారు!

First Published Sep 9, 2019, 11:49 AM IST

సినిమాను డైరెక్టర్ చేయడమనేది మామూలు విషయం కాదు. అన్ని డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేస్తూ మంచి అవుట్ పుట్ రాబట్టడం పెద్ద టాస్క్.

సినిమాను డైరెక్టర్ చేయడమనేది మామూలు విషయం కాదు. అన్ని డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేస్తూ మంచి అవుట్ పుట్ రాబట్టడం పెద్ద టాస్క్. అందుకే ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేసి వర్క్ నేర్చుకొని ఆ తరువాత సినిమాని డైరెక్ట్ చేస్తుంటారు. కానీ కొందరు దర్శకులు మాత్రం షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అనుభవం తెచ్చుకొని నేరుగా ఫీచర్ ఫిలిమ్స్ చేసిన వారున్నారు. ఆ దర్శకులెవరో ఇప్పుడు చూద్దాం!
undefined
కెవిఆర్ మహేంద్ర - 'నిశీది' అనే షార్ట్ ఫిలిం రూపొందించి దాని ద్వారా మంచి పేరు తెచ్చుకున్న మహేంద్ర 'దొరసాని' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అతడి ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు.
undefined
సంతోష్ జాగర్లపూడి - 7.30 AM అనే షార్ట్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేశాడు సంతోష్. గెటప్ శ్రీను నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ కి యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో సంతోష్ జాగర్లమూడికి హీరో సుమంత్ ఛాన్స్ ఇచ్చాడు. వీరి కాంబినేషన్ లో 'సుబ్రమణ్యపురం' అనే సినిమా వచ్చింది.
undefined
లక్ష్మణ్ కార్య - 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన లక్ష్మణ్ అంతకుముందు 'గుడ్ నైట్' అనే సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో షార్ట్ ఫిల్మ్ తీశాడు. అతడి రైటింగ్ స్కిల్స్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి.
undefined
నాగాశ్విన్ - 'మహానటి' అనే నేషనల్ రేంజ్ అవార్డులు అందుకున్న సినిమాను రూపొందించిన నాగాశ్విన్ మొదట షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. 'యాదోన్ కి భారత్' అనే షార్ట్ ఫిలిం తీసి గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.
undefined
ప్రశాంత్ వర్మ - యూనిక్ కంటెంట్ తో 'ది సైలెంట్ మెలోడీ', 'డైలాగ్ ఇన్ ది డార్క్' వంటి షార్ట్ ఫిలిమ్స్ తీసిన ప్రశాంత్ వర్మ 'అ!' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
undefined
శివ నిర్వాణ - 'నిన్ను కోరి' సినిమాతో భారీ హిట్ అందుకున్న దర్శకుడు శివ షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ఆరంభించాడు. అతడు రూపొందించిన 'లవ్ ఆల్జీబ్రా' అనే షార్ట్ ఫిల్మ్ కి మంచి అప్లాజ్ వచ్చింది.
undefined
తరుణ్ భాస్కర్ - తన ఆర్ట్ వర్క్ తో ఎన్నో అవార్డులు అందుకున్న తరుణ్ భాస్కర్ 'అనుకోకుండా' అనే షార్ట్ ఫిల్మ్ ని 48 గంటల్లో తెరకెక్కించి అవార్డు అందుకున్నాడు. ఆ తరువాత 'పెళ్లిచూపులు' అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.
undefined
హుస్సేన్ షా కిరణ్ - 'లవ్ అగైన్', 'షాడో' వంటి షార్ట్ ఫిలిమ్స్ ని రూపొందించిన ఇతడు 'మీకు మీరే మాకు మేమే' అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
undefined
కృష్ణచైతన్య - 'ఇంప్రెస్' అనే షార్ట్ ఫిలింతో గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్ర దర్శకుడు నారా రోహిత్ ని హీరోగా పెట్టి 'రౌడీ ఫెలో' అనే సినిమాను రూపొందించాడు.
undefined
మేర్లపాక గాంధీ - 'కర్మరా దేవుడా' అనే హిలారియాస్ షార్ట్ ఫిల్మ్ తీసి ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు సంపాదించిన మేర్లపాక గాంధీ 'ఎక్స్ ప్రెస్ రాజా'తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు.
undefined
సుజీత్ - దాదాపు 38 షార్ట్ ఫిలిమ్స్ తీసిన సుజీత్ 'రన్ రాజా రన్' తో శర్వానంద్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకొని దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించాడు. ఇటీవల అతడు తెరకెక్కించిన 'సాహో' ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
undefined
కార్తిక్ ఘట్టమనేని - 'సూర్య వర్సెస్ సూర్య' సినిమాతో దర్శకుడిగా మారిన కార్తిక్ అంతకముందు 35 షార్ట్ ఫిలిమ్స్ ని తెరకెక్కించాడు.
undefined
పవన్ సాధినేని - ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ని తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్ సాధినేని 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్నాడు.
undefined
రాహుల్ సంక్రిత్యాన్ - 'ది ఎండ్' అనే హారర్ షార్ట్ ఫిలింని రూపొందించి పాపులర్ అయిన రాహుల్ 'టాక్సీవాలా' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ నిరూపించుకున్నాడు.
undefined
విరించి వర్మ - షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన విరించి వర్మ 'ఉయ్యాల జంపాల' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
undefined
click me!