స్నేహితులని కలిసేందుకు కర్ణాటకలోని తన స్వగ్రామానికి వెళ్లిన హీరో శ్రీకాంత్..హోటల్ యజమానితో ప్రత్యేక అనుబంధం

First Published | Sep 15, 2024, 4:50 PM IST

  తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ ఆదివారం కర్ణాటకలోని ధారవాడకు వెళ్లారు. ధారవాడలోని తన స్నేహితులను కలవడానికి ఆయన ప్రత్యేకంగా వెళ్లారు.    

హీరో శ్రీకాంత్ ఆదివారం రోజు కర్ణాటకలోని తన స్వగ్రామం గంగావతిని సందర్శించారు. అక్కడికి సమీపంలో ఉన్న ధారవాడ పట్టణంలో శ్రీకాంత్ ఉన్నత విద్యని అభ్యసించారు. శ్రీకాంత్ తెలుగు నటుడే అయినప్పటికీ ఆయన స్వస్థలం కర్ణాటకలోని గంగావతి అని చాలా మందికి తెలియదు. 

దీంతో శ్రీకాంత్ తరచూ ధారవాడకు వస్తుంటారు. బెంగళూరు నుంచి హుబ్బళ్లికి విమానంలో వచ్చిన ఆయన.. స్వగ్రామం కొప్పల్ జిల్లాలోని గంగావతికి వెళ్లేందుకు వచ్చారు. ఈ క్రమంలో ధారవాడకు చేరుకుని స్నేహితుడి ఇంట్లో అల్పాహారం  తీసుకున్నారు. 


ధారవాడకు చెందిన స్నేహితుడు దినేష్ శెట్టి ఇంట్లో నటుడు శ్రీకాంత్ అల్పాహారం సేవించారు. దినేష్ శెట్టి ధారవాడ నగరంలోని ఉపవన హోటల్ యజమాని. 

కళాశాల రోజుల్లో నటుడు శ్రీకాంత్ ఉపవన హోటల్‌లో తిఫిన్ చేసేవారు. దీంతో తరచూ ఉపవన హోటల్ యజమానిని కలవడానికి శ్రీకాంత్ వస్తుంటారు. 

 నటుడు శ్రీకాంత్ కొప్పల్ జిల్లాలోని గంగావతికి చెందినవారు. ధారవాడ నగరంలోనే డిగ్రీ చదివారు. ఆ తర్వాత నటన కోసం హైదరాబాద్ వెళ్లి తెలుగు సినీ రంగంలో పేరు తెచ్చుకున్నారు. ఇంతటి పెద్ద నటుడైనా తన స్వగ్రామం గంగావతి, డిగ్రీ చదివిన ధారవాడ నగరానికి తరచూ వస్తుంటారు. హీరో శ్రీకాంత్ తల్లిదండ్రుల స్వగ్రామం ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని మేకవారిపాలెం. అయితే శ్రీకాంత్ తండ్రి వ్యాపార నిమిత్తం కర్ణాటకకి వెళ్లి స్థిరపడ్డారు. 

Latest Videos

click me!