ఉదయాన్నే కదిలిన సెలబ్రిటీలు, ఓటు వేసిన మెగాస్టార్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్ రాజమౌళి..

First Published Nov 30, 2023, 10:26 AM IST

తెలంగాణలో ఓటింగ్ మొదలయ్యింది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ ఓటు వేయడానికి బయలు దేరారు. ఇక సినీతారలైతే ఉదయాన్నే ఓటు వేయడానికి పోలీంగ్ బూతుల దగ్గర బారులు తీరారు. ఇప్పటి వరకూ ఎవరెవరు ఓటు వేశారంటే..? 

తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ జోరుగా సాగుతోంది... ముఖ్యంగా ఈసారి  సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు అది కూడా  ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎప్పుడో వస్తారు అనుకుంటే.. ఎవరు లేవకముందే తమ ఓటును వినియోగించుకున్నారు స్టార్స్. ఇక ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే.. 

ఉదయం  ఏడు గంటల వరకే స్టార్ హీరోలు ఓటు హక్కును వినియోగించుకున్నారు అందులో మెగాస్టార్ చిరంజీవి.. ఆయన సతీమణి సురేఖ కుమార్తె శ్రీజలతో కలిసి వచ్చి పోలింగ్ బూత్ 149 దగ్గర తమ ఓటుహక్కునువినియోగించుకన్నారు. ఇక ఇవే పోలింగ్ బూత్ లో మధ్యాహ్నం రామ్ చరణ్ ఓటు వేయబోతున్నారు. 
 

Latest Videos



ఇక ఓబుల్ రెడ్డి స్కూల్ లోని  పోలింగ్ బూత్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భర్య ప్రణీత, తల్లి తోకలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఇక హీరో వెంకటేష్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని ప్రెసిడెన్సీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వెంకటేష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక హీరో శ్రీకాంత్.. ఆయన కుమారుడు యంగ్ హీరో రోషన్.. ఊహాలతో కలిసి వచ్చి.. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్క‌ూల్ లో తమ ఓటు వేశారు. ఇదే పోలింగ్ బూత్ లో యంగ్ హీరో నితిన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

బిఎస్ఎన్ ఎల్ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన మాత్రం ఒక్కడే వచ్చి ఓటు వేశారు.

మామూలుగా పోలింగ్ సమయంలో ఉదయం పదిగంటలు దాటితే కానీ ఓటింగ్ కు బైటికి రాని సెలబ్రిటీలు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ సారి ముందుకు వచ్చారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ .. గ్లోబల్ స్టార్ రాజమౌళి.. తన సతీమణి రమ తో కలిసి అందరికంటే ముందు ఓటు హక్కును వినియోగించుకున్ారు.  ఎఫ్ ఎన్ సీసీలోని ఓటింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రానా దగ్గుబాటి. 
 

click me!