గద్దర్ అవార్డులకు ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారో తెలుసా? వెండి, బంగారు అవార్డులు అందుకున్నవారు ఎవరంటే?

Published : Mar 20, 2026, 08:12 AM IST

చాలా కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదురు చూస్తున్న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్స్ ఉగాది నాడు ఘనంతా జరిగింది. ప్రభుత్వం కళాకారులను సత్కరించి ఇచ్చే ఈ అవార్డులకు ప్రైజ్ మనీ ఎంత ఇస్తారో తెలుసా? ఏ కేటగిరిలో.. ఏ అవార్డుకు ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారు? 

PREV
110
నంది అవార్డుల స్థానంలో..

గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఇచ్చిన నంది అవార్డులను.. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులుగా మార్చి అందిస్తోంది. ఈక్రమంలో 2025 ఏడాదికి సంబంధించిన గద్దర్ అవార్డులను ప్రకటించడంతో పాటు.. ఉగాదినాడు మార్చి 19న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున లతో పాటు భారీగా సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

210
ముఖ్యమైన అవార్డులు ఇవే..

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్స్ లో ఎవరెవరు ఏ కేటగిరిలో అవార్డులు అందుకున్నారు, ఏ అవార్డుకు ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారు, ఏ మెమెంటో ఇచ్చారు ఫుల్ డీటెయిల్స్..

బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ – రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు అందుకోగా, బెస్ట్ లీడింగ్ యాక్టర్ – నాగచైతన్య తండేల్ సినిమాకు అందుకున్నారు. వీరిద్దరికి సిల్వర్ మెమెంటో తో పాటు పది లక్షలు – ప్రశంసా పత్రం అందించారు. ఇక పెద్దల అవార్డుల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు – చిరంజీవి

బిఎన్ రెడ్డి అవార్డు – సింగీతం శ్రీనివాస్ , నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్విని దత్, సి నారాయణ రెడ్డి అవార్డు – సుద్దాల అశోక్ తేజ, అక్కినేని నాగేశ్వరరావు అవార్డు – జయసుధ, కాంతారావు అవార్డు – ఆర్ నారాయణ మూర్తి , రఘుపతి వెంకయ్య అవార్డు – రమేష్ ప్రసాద్ , పైడి జైరాజ్ అవార్డు – కమల్ హాసన్ కు అందించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ అవార్డులకు గాను గోల్డెన్ మెమెంటో తో పాటు పది లక్షలు ప్రైజ్ మనీ. ప్రశంసా పత్రం అందించారు.

310
మెయిన్ అవార్డుల విషయానికి వస్తే..

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్, అజయ్ కుమార్ ఛాంపియన్ సినిమాకు, బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ – వై గోవిందా రాజు అఖండ 2 సినిమాకు, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ – పీటర్ హాన్స్ ఛాంపియన్ సినిమాకు, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ – తోట తరణి ఛాంపియన్ సినిమాకు, బెస్ట్ కొరియోగ్రాఫర్ – ఆట సందీప్ ఛాంపియన్ సినిమాకు, బెస్ట్ ఆడియోగ్రాఫర్ – M రాజాకృష్ణన్ కిష్కింధపురి సినిమాకు, బెస్ట్ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ మిరాయ్ మూవీకి, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ సినిమాకు, బెస్ట్ లిరిక్ రైటర్ – నా కొడకా సాంగ్ – నందకిషోర్ కుబేర సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ – అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు, బెస్ట్ స్టోరీ రైటర్ – గుణశేఖర్ యుఫొరియా సినిమాకు అందుకోగా.. వీరికి సిల్వర్ మెమెంటో తో పాటు అయిదు లక్షల ప్రైజ్ మనీ.. ప్రశంసా పత్రం అందించారు.

410
ఇతర విభాగాలు చూసుకుంటే..

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – రోహన్ రాయ్ గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు, బెస్ట్ కమెడియన్ గా కృష్ణతేజ జిగ్రీ సినిమాకు, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం కేటగిరీలో అనగనగా సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి అవార్డు అందుకోగా..వీరికి సిల్వర్ మెమెంటోతో పాటు 5 లక్షలు ప్రైజ్ మనీ ఇచ్చారు. ఇక బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం అనగనగా దర్శకుడు సన్నీ సంజయ్ – కాంస్యం మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం అందించారు.

ఇక బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ – మిరాయ్ – విశ్వప్రసాద్ , బెస్ట్ సోషల్ మెసేజ్ – కోర్ట్ – ప్రశాంతి త్రిపురనేని – సిల్వర్ మెమెంటో – రెండున్నర లక్షలు – ప్రశంసా పత్రం, బెస్ట్ ఫీచర్ ఫిలిం ఎన్విరాన్మెంట్ & హిస్టరీ – ఇగ్వా – పూర్ణచంద్ర భట్ – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం, బెస్ట్ ఫీచర్ ఫిలిం నేషనల్ ఇంటిగ్రేషన్ – తండేల్ – అల్లు అరవింద్, చందూ మొండేటి – సిల్వర్ మెమెంటో – రెండున్నర లక్షలు – ప్రశంసా పత్రం, ఉత్తమ ప్రజాదరణ చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం – శిరీష్ రెడ్డి, అనిల్ రావిపూడి – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం అందించడం జరిగింది.

510
బెస్ట్ మ్యూజిక్ లో అవార్డులు అందుకున్నది ఎవరు?

బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ – సాహితి చాగంటి కన్నప్ప సినిమాకు అందుకోగా, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా అనురాగ్ కులకర్ణి రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు అందుకున్నారు. ఇక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – మార్క్ కె రాబిన్ దండోరా సినిమాకు అందుకోగా వీరికి సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం అందించారు.

ఇక బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – భూమిక (యుఫొరియా) బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – శివాజీ దండోరా సినిమాకు గాను కాంస్యం మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం అందించారు. బెస్ట్ డెబ్యూ ఫ్యూచర్ ఫిలిం – లిటిల్ హార్ట్స్ – సాయి మార్తాండ్ – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం

బెస్ట్ డైరెక్టర్ అవార్డు – సాయిలు కంపాటి – రాజు వెడ్స్ రాంబాయి – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం అందుకున్నారు.

610
మూడవ బెస్ట్ ఫీచర్ ఫిలిం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

నిర్మాత – సందీప్ అగరం -సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం

దర్శకుడు – రాహుల్ శ్రీనివాస్ – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం

నటీనటులు – తిరువీర్, టీనా శ్రావ్య – కాంస్యం మెమెంటో, ప్రశంసా పత్రం

710
సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం – దండోరా

నిర్మాత ముప్పినేని రవీంద్ర బెనర్జీ – సిల్వర్ మెమెంటో – ఏడు లక్షలు – ప్రశంసా పత్రం

దర్శకుడు మురళి కాంత్ – సిల్వర్ మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం

నటీనటులు – నందు, మనిక – కాంస్యం మెమెంటో

810
మొదటి బెస్ట్ ఫీచర్ ఫిలిం – రాజు వెడ్స్ రాంబాయి

నిర్మాత వేణు ఉడుగుల – గోల్డెన్ మెమెంటో – పది లక్షలు – ప్రశంసా పత్రం

దర్శకుడు సాయిలు కంపాటి – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం

నటీనటులు – అఖిల్ రాజ్, తేజస్వి రావు – కాంస్యం మెమెంటో

910
స్పెషల్ జ్యూరీ కేటగిరి

దర్శకుడు – రాజు రాజకొండ(23) – సిల్వర్ మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం

సహ నటుడు – చైతు జొన్నలగడ్డ(రాజు వెడ్స్ రాంబాయి) -సిల్వర్ మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం

నటుడు – రోషన్ (ఛాంపియన్) – సిల్వర్ మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం

నటి – అనంతిక సనల్ కుమార్ (8 వసంతాలు) – సిల్వర్ మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం

1010
బెస్ట్ బుక్ అండ్ డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిం అవార్డులు..

బెస్ట్ బుక్ అవార్డు – శూన్యం నుండి శిఖరాగ్రం వరకు – ప్రభు – సిల్వర్ మెమెంటో – మూడు లక్షల రూపాయలు – ప్రశంసా పత్రం

బెస్ట్ క్రిటిక్ – హెచ్ రమేష్ – సిల్వర్ మెమెంటో – మూడు లక్షల రూపాయలు – ప్రశంసా పత్రం

మూడో బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం – మహామనిషి డాక్టర్ AS రావు – బాల బ్రహ్మచారి – కాంస్యం మెమెంటో – లక్ష రూపాయలు – ప్రశంసా పత్రం –

రెండో బెస్ట్ డాక్యుమెంటరీ – ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ – పొన్నం రవిచంద్ర – సిల్వర్ మెమెంటో – మూడు లక్షల రూపాయలు – ప్రశంసా పత్రం

ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ – యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ – చీరందాసు శ్రీకాంత్ – గోల్డెన్ మెమెంటో – అయిదు లక్షల రూపాయలు – ప్రశంసా పత్రం

డిప్లమా ఆఫ్ బెస్ట్ డాక్యుమెంటరీ & షార్ట్ ఫిలిం – తల్లితండ్రుల ఆత్మగౌరవం – కనుపర్తి హనుమండ్లు – ప్రశంసా పత్రం

మూడో బెస్ట్ షార్ట్ ఫిలిం – సైబర్ స్లేవరీ – నీలిమ – కాంస్య మెమెంటో – లక్ష రూపాయలు – ప్రశంసా పత్రం

సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిం – మౌనమే నీ భాష – రాఘవేంద్ర వర్మ, విశ్వాస్ హనుర్కర్ – సిల్వర్ మెమెంటో – మూడు లక్షల రూపాయలు – ప్రశంసా పత్రం

ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం – వనజీవి రామయ్య – రవీంద్ర – గోల్డెన్ మెమెంటో – అయిదు లక్షల రూపాయలు – ప్రశంసా పత్రం అందుకున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories