Telangana Assembly Elections 2023:ఎన్టీఆర్, మహేష్, బన్నీ, చరణ్, ప్రభాస్... మీ హీరోలు ఓట్లు వేసేది ఇక్కడే!

Published : Nov 29, 2023, 11:24 AM IST

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. మన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఓటింగ్ లో పాల్గొననున్నారు. ఎవరెవరు ఎక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకుంటారో చూద్దాం...   

PREV
18
Telangana Assembly Elections 2023:ఎన్టీఆర్, మహేష్, బన్నీ, చరణ్, ప్రభాస్... మీ హీరోలు ఓట్లు వేసేది ఇక్కడే!
Telangana Assembly Elections 2023

ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఆయుధం. ఓటు వేయడం సామాజిక బాధ్యత. మరి నలుగురికి స్ఫూర్తిగా నిలిచే హీరోలు ఓటు హక్కు వినిగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. గురువారం తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly Elections 2023)ఎన్నికలు జరగనున్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవితో పాటు పలువురు ఓటింగ్ లో పాల్గొననున్నారు. తమ రహస్యమైన ఓటును ఇష్టమైన అభ్యర్థికి వేయనున్నారు. మీ అభిమాన హీరోలు ఎక్కడ ఓటు ఓటు వేస్తున్నారో తెలుసుకోండి...

28


జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 165లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓటు వేయనున్నారు. భార్య నమ్రత సైతం ఓటు హక్కు వినియోగించుకోనుంది. ఇదే బూత్ నందు మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్ ఓటు వేయనున్నారు. 
 

38


జూబ్లీహిల్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 149లో మెగాస్టార్ చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. భార్య సురేఖతో పాటు రామ్ చరణ్ దంపతులు, హీరో నితిన్ ఇక్కడే ఓటు వేయనున్నారు. 

48

ఓబుల్ రెడ్డి స్కూల్ నందు గల పోలింగ్ బూత్ నంబర్ 150లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓటు వేయనున్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి సైతం తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 
 

58
Image: Instagram

బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ నంబర్ 153లో అల్లు అర్జున్ ఓటు వేయనున్నారు. అలాగే స్నేహారెడ్డి, అల్లు అరవింద్, శిరీష్ ఇక్కడే ఓటు వేయనున్నారు. 
 

68

మణికొండలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రభాస్ ఓటు వేయనున్నాడు. ఇక్కడే అనుష్క, వెంకటేష్, బ్రహ్మానందం ఓటు వేయనున్నారని సమాచారం. 
 

78

వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఏ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 151లో నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్ తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

88
Vijay Devarakonda

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ బూత్ నంబర్ 164లో హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండతో పాటు నటుడు శ్రీకాంత్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇంకా పలువురు స్టార్స్ వివిధ ప్రాంతాల్లో ఓటు వేయనున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories