Poonam Bajwa
హీరోయిన్ పూనమ్ బజ్వా హాట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది. ఇంస్టాగ్రామ్ వేదికగా అమ్మడు పరువాల పవర్ చూపిస్తుంది. బోల్డ్ అండ్ గ్లామరస్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సిల్వర్ స్క్రీన్ పై హోమ్లీ రోల్స్ చేసిన పూనమ్ బజ్వా తీరు షాక్ ఇస్తుంది.
Poonam Bajwa
తాజాగా బికినీలో అందాలు విందు చేస్తూ ఓ వీడియో చేసింది. సదరు వీడియో వైరల్ కాగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పూనమ్ బజ్వా రెండు దశాబ్దాల క్రితమే పరిశ్రమలో అడుగుపెట్టింది. అయితే ఆమెకు కాలం కలిసి రాలేదు. హీరోయిన్ గా ఎదగలేదు.
Poonam Bajwa
2005లో పూనమ్ కెరీర్ మొదలైంది. నవదీప్ కి జంటగా 'మొదటి సినిమా' టైటిల్ తో ఓ చిత్రం చేసింది. అది ఆశించినంతగా ఆడలేదు. నాగార్జున-నయనతార జంటగా నటించిన బాస్ మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
Poonam Bajwa
అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ లో తెరకెక్కిన పరుగు మూవీలో హీరోయిన్ అక్క పాత్ర చేసింది. అప్పటికే పూనమ్ కెరీర్ నెమ్మదించింది. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టినప్పటికీ... పూనమ్ కి గుర్తింపు రాలేదు. ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ లో అడుగు పెట్టింది.
Poonam Bajwa
తమిళంలో వరుసగా టూ టైర్ హీరోల పక్కన చిత్రాలు చేశారు పూనమ్ బజ్వా. స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆమె కల అక్కడ కూడా నెరవేరలేదు. ప్రస్తుతం పూనమ్ మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో అరాకొరా చిత్రాలు చేస్తున్నారు. కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా, సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది.
Poonam Bajwa
తెలుగులో పూనమ్ నటించిన చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఆ మూవీలో ఎన్టీఆర్ కూతురు లోకేశ్వరి పాత్రలో తళుక్కున మెరిసింది. అది కేవలం చిన్న గెస్ట్ రోల్ వంటిది. పూనమ్ కెరీర్లో ఎఫైర్ రూమర్స్ కూడా ఉన్నాయి.