Tejaswi: టాలీవుడ్‌లో కమిట్‌మెంట్‌పై బిగ్‌ బాస్‌ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు.. పింక్‌ డ్రెస్‌లో అందాల దుమారం..

Published : Aug 14, 2022, 06:04 PM ISTUpdated : Aug 14, 2022, 10:45 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ తేజస్వి మదివాడ బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే. తన ఘాటు రేపే అందాలను ఏమాత్రం ఫిల్టర్‌ లేకుండా చూపిస్తూ తెలుగు ఆడియెన్స్ మైండ్ బ్లాక్‌ చేసింది.  టాలీవుడ్‌లో కమిట్‌మెంట్స్ గురించి ఓపెన్‌గా చెప్పేసింది.

PREV
110
Tejaswi: టాలీవుడ్‌లో కమిట్‌మెంట్‌పై బిగ్‌ బాస్‌ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు..  పింక్‌ డ్రెస్‌లో అందాల దుమారం..

బోల్డ్ హీరోయిన్‌గా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న తేజస్విని మదివాడ(Tejaswi Madivada) ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అందాల విస్పోటనం చేసింది. పింక్‌ ఔట్‌ఫిట్‌లో టాప్‌ అందాల షో చేస్తూ ఫ్యాన్స్ కి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఎలాంటి ఫిల్టర్‌ లేని అందాల విందుతో నెటిజన్లకి అందాల విందు చేస్తుంది. ఈ అమ్మడి నయా ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. తేజస్వి గ్లామర్ బ్యూటీ అనేది తెలిసిందే. గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనకాడదు. తన హాట్‌ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంటుంది. బోల్డ్ రోల్స్ చేయడానికి వెనకాడని ఈ భామ ఇప్పుడు మరోసారి తన హాట్‌ షోతో అందరి అటెన్షన్‌ తన వైపు తిప్పుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సెక్సీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

210

తేజస్వి మదివాడ ఇప్పుడు `కమిట్‌ మెంట్‌` (Commitment) అనే చిత్రం చేస్తుంది. కమిట్ మెంట్‌కి సంబంధించిన అసలు విషయాలను రివీల్‌ చేసే చిత్రమిది. చాలా బోల్డ్ కంటెంట్‌తో అన్ని అంశాల మేళవింపుగా ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తేజస్వి మీడియాతో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

310

`కమిట్‌మెంట్‌` చిత్రం నాలుగు కథల సమాహారమట. ఇందులో తాను సినిమా అవకాశాల కోసం తిరిగే అమ్మాయిలా కనిపిస్తుందని, తన పాత్ర శ్రీరెడ్డి పాత్రని పోలి ఉంటుందని చెప్పింది. సినిమా కథ చిత్ర పరిశ్రమలో జరిగే అంశాలకు దగ్గరగా ఉంటుందన్నారు. `ఓ రకంగా ఇండస్ట్రీ లోపల జరిగే అంశాలకు ప్రతిబింబింగా నిలుస్తుందని సినిమా ట్రైలర్ చూస్తే ఆలా అనిపిస్తుందేమోగానీ నిజానికి సినిమా లో మంచి కంటెంట్, మెసేజ్ ఉంటుంది .Tejaswi Madivada Hot Photos.

410

అందరూ సినిమా ఇండస్ట్రీ ని బద్నామ్ చేస్తారు కానీ ఇది అన్ని ఇండస్ట్రీ లో ఉంది. మన గ్లామర్ ప్రపంచం లో ఉంటాం కనుక మనకి అందరికి ప్రాబ్లెమ్ గ్గా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ని బద్నామ్ చేయద్దు అని చెప్పేదే ఈ సినిమా మెసేజ్, ఈ సినిమా రీయాలిటీ దగ్గర గా ఉంటుంది.  నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటున్నా. కమిట్‌మెంట్ మీద చాలా సినిమాలొచ్చాయి. దానికిది డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతిదీ సినిమాటిక్‌గా చూపించాం. 

510

నేను అవకాశాల కోసం సినీ ఇండస్ట్రీ లో ఎదురు చూడటం, ప్రతి ఆఫీస్ కి వెళ్లితే ఏం ప్రాబ్లెమ్ అనేది ఉంటుంది. నాకు ఈసినిమా కథ నచ్చడానికి కారణం ఉంది. నేను మొదట్లో చాలా  మంది మేనేజర్స్ తో మాట్లాడాలంటే భయం వేసేది. ఏమి మాటాడుతున్నారో అర్థం కాకపోయేది . చాలా కష్టంగా అనిపించేది. కానీ ఈ సినిమా ఇండస్ట్రీ నాకు ఒక ఫుడ్ పెట్టి,నాకో దారి చూపించింది. ఈ రోజు మీ ముందు ఉన్నాను అంటే సినిమా ఇండస్ర్టీ కారణం కానీ ఆలా అని లేదు కానీ ప్రతి దాంట్లో గుడ్, బ్యాడ్ ఉంది` అని చెప్పింది తేజస్విని. 

610

ఇంకా చెబుతూ, `నేను జర్నలిజం చేశాను. అందులో మనుగడ సాధించలేక  ఫిలిం ఇండస్ట్రీ కి వచ్చాను. ఇండస్ట్రీలోకి ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు వస్తున్నారు. మెంటల్ గా నేను స్ట్రాంగ్. కంటెంట్ నచ్చితే అడల్ట్ అయినా ఏది అయినా చేస్తా.  ఈ సినిమాలో ఆర్జీవి బిట్‌ కూడా ఉంటుంది. నా జీవితంలో జరిగిన అంశాలే ఉంటాయి. `డర్టీ పిక్చర్‌`లో డర్టీ లేకుండా చూడలేరు. అలాగే మా సినిమాలోనూ డర్టీ ఉంటుంది. 
 

710

ఐస్‌ క్రీమ్‌ సినిమా గురించి చెబుతూ, సినిమా కి ఎంత అవసరం అంత చేయాలి, నాకు బోల్డ్ అయినా కిస్ సీన్ అయినా కంటెంట్ డిమాండ్ చేస్తే తప్పకుండ చేస్తాను. నాతో చేసిన అబ్బాయి శ్రీనాథ్ ఇందులో వాడు చాలా ఇబ్బంది పడ్డాడు . నాతో రొమాన్స్ లో తెలియని వాడికి ఫీలింగ్స్ ఇచ్చేదానికన్నా తెలిసిన వాడికి ఇవ్వటం బెటర్ కదా అని శ్రీనాథ్ తో చేశాను. ఇప్పటి వరకు పరిశ్రమలో నా పర్సనాలిటీ కి గుర్తింపు వచ్చింది కానీ, నా నటనకి రాలేదు. ఈ సినిమాతో వస్తుంది అని అనుకుంటున్నా. ఈ సినిమాతో నాకు బ్రేక్ వస్తుంది అనుకుంటున్నా. 
 

810

ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌ గురించి చెబుతూ, `నన్ను  ఎవరు అడగలేదు, అందరూ కూల్ గా ఉన్నారు. కొంత మంది ఉన్నారు.ఇంకా ఏమి లేదు. ఒక డైరెక్టర్ కమిట్మెంట్ అడిగి చేస్తే మనకి ఫుల్ పెర్ఫార్మన్స్ రాదు. మనం కమిట్మెంట్ అడగలేదు అందుకే మంచి గా పెర్ఫార్మన్స్ వచ్చింది. కమిట్ మెంట్ అనగానే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుంది అందరికి. నాకు చాలా మంది డైరెక్టర్స్ తెలుసు. వాళ్లతో నాకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నేను పక్క సూపర్ గా ఉన్నాను.  

910

కమిట్మెంట్ అడిగారు అని ఏమి అయినా సినిమాలు వదిలేశారా ? అన్న ప్రశ్నకి తేజస్వి మదివాడ స్పందిస్తూ, `నన్ను కమిట్మెంట్ అడగాలంటే బయపడేవాళ్లు చాలా మంది. నేను వర్కింగ్ హార్డ్ అండీ పని చేయకపోతే ఏమి రాదు. నన్ను అక్క చెల్లి పాత్రలకు అడుగుతున్నారు. లేదా ఐస్క్రీమ్ పాపా లాగా బోల్డ్ గా అడుగుతున్నారు. 

1010

బిగ్‌ బాస్‌ గురించి చెబుతూ, బిగ్‌ బాస్ లోకి వెళ్తే కెరీర్‌ పాడవుతుందనే దాంట్లో నిజం లేదు. నేను బాగానే ఉన్నాను. కారు కూడా కొన్నాను. ఇల్లు కొన్నాను. బిగ్ బాస్ కి వెళ్ళటం వలన నేను ఎవరు ఏమి అన్న ఐ డోంట్ కేర్. నాకు నేను బ్రతకాలి , సినిమా ఇండస్ట్రీ కి వచ్చిందే మనీ కోసం. నేను చాలా స్మార్ట్ . లైఫ్‌ని ఎలా  రన్ చేయాలో తెలుసు. పెళ్లి గురించి చెబుతూ, పెళ్లి చేసుకుంటే సినిమాలు మానేయాలన్నారు. అందుకే పెళ్లి మానేసుకున్నా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories