బిగ్ బాస్ లోకి వెళ్లడం నా కెరీర్ లో చేసిన పెద్ద మిస్టేక్ అని తేజస్వి పేర్కొంది. బిగ్ బాస్ వల్ల చాలా మాటలు పడ్డా, పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. దీనితో డిప్రెషన్ లోకి వెళ్ళా. ఇక నేను సినిమాల్లో నటించను అని చెప్పా. అలా చేయడం నా కెరీర్ కి మైనస్ గా మారింది. రెండేళ్లు బాగా గ్యాప్ వచ్చింది అని తేజస్వి మడివాడ పేర్కొంది. ఆ టైం లో నాకు మంచి క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ ని ఉపయోగించుకోలేకపోయా అని తేజస్వి తెలిపింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హార్ట్ ఎటాక్, ఐస్ క్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, బాబు బాగా బిజీ లాంటి చిత్రాలు తేజస్వినికి గుర్తింపు తీసుకువచ్చాయి.