Amritha Aiyer : ‘హనుమాన్’ హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా? అమృత అయ్యర్ దశ మారుతుందా!

Published : Jan 11, 2024, 10:53 AM IST

పాన్ ఇండియా మూవీ ‘హనుమాన్’ Hanu Man తో అలరించబోతున్న యంగ్ బ్యూటీ అమృతా అయ్యర్ Amritha Aiyer గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆమె కెరీర్ లో ప్రస్తుతం బ్రేక్ లభిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.   

PREV
16
Amritha Aiyer : ‘హనుమాన్’ హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా? అమృత అయ్యర్ దశ మారుతుందా!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా అమృత అయ్యర్ (Amritha Aiyer)  మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. చాలా సైలెంట్ గా తెలుగులో మంచి ఆఫర్లు దక్కించుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ ఆడియెన్స్ లో స్పెషల్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లకు అమృతకు ‘హనుమాన్’తో మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తోంది.

26

ఈ క్రమంలో ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. అమృతా అయ్యర్ తమిళనాడులోని చెన్నైలో 14 మే 1994న జన్మించింది. మరో నాలుగు నెలల్లో ఆమె 30వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోబోతోంది. 

36

పుట్టింది చెన్నై అయినా కర్ణాటకలోని బెంగళూరులో తమిళం మాట్లాడే కుటుంబంలో పెరిగింది. ఆమె బెంగళూరులోనే సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేసింది.  తర్వాత మోడల్‌గా కెరీర్ ను ప్రారంభించింది. 

46

అమృతా అయ్యర్ తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుతుంది. 2012 నుంచి యంగ్ బ్యూటీ తన నటన కెరీర్ ను కొనసాగిస్తోంది. తొలుత తమిళ చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో షైన్ అవుతోంది. 
 

56

విజయ్ దళపతి ‘బిజిల్’ చిత్రంలో తన నటనకు మంచి గుర్తింపు దక్కించుకుంది. రామ్ పోతినేని ‘రెడ్’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అప్పటి నుంచి వరుసగా తెలుగులోనే సినిమాలు చేస్తూ వస్తోంది. 
 

66

ప్రస్తుతం తేజా సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న ‘హనుమాన్’ HanuMan  మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎడెనిమిది భాషల్లో విడుదలవుతోంది. ఇప్పటికే మంచి హైప్ కూడా క్రియేట్ అయ్యింది. రేపు విడుదల కాబోతోంది. ‘గుంటూరు కారం’కి పోటీగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే అమృతకు పాన్ ఇండియా హీరోయిన్ క్రేజ్ దక్కే అవకాశం ఉందంటున్నారు.  

click me!

Recommended Stories