వీరితో పాటు రానా దగ్గుబాటి, రవితేజ, నాని, వరలక్ష్మి శరత్ కుమార్, శ్రీకాంత్, కోన వెంకట్ లాంటి ప్రముఖులు హాజరై తేజ సజ్జ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చూడాలని ఉంది, ఇంద్ర, గంగోత్రి, కలిసుందాం రా లాంటి చిత్రాల్లో తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ తో క్రేజీ హీరోగా దూసుకుపోతున్నారు.