Prabhas: హీరోయిన్ కు ముద్దు పెట్టాలంటే తండ్రి పర్మిషన్ అడిగిన ఏకైక హీరో, ప్రభాస్ టాప్ సీక్రెట్ బయటపెట్టిన స్టార్ నటుడు..

Published : Nov 16, 2026, 11:30 AM IST

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ఆన్ స్క్రీన్ రచ్చఅంతా ఇంతా కాదు.. ఆయన కటౌట్ తెరపై కనిపిస్తే చాలు ఆడియన్స్ కు పూనకాలు వచ్చేస్తుంటాయి. అటువంటి హీరో ఒకప్పుడు చిన్న ముద్దు సీన్ చేయాలన్నా.. తండ్రి అనుమతి తీసుకునేవాడంటే మీరు నమ్ముతారా?

PREV
14
ప్రభాస్ సినిమా అంటే పూనకాలే..

పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ రచ్చ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్‌. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో రెచ్చిపోతున్నాడు. ప్రభాస్ సినిమా అంటే అభిమానులకు పూనకాలు గ్యారెంటీ.. ఇక ఆయనకు సంబంధించిన విషయం ఏదైనా బయటకు వస్తే.. అది ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా ప్రభాస్ ఫుడ్, పెళ్లికి సబంధించిన వార్తలు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. కానీ ప్రభాస్ కు సబంధించిన మరో విషయం కూడా రీసెంట్ గా తెగ షికారు చేస్తోంది. ప్రభాస్ తన తండ్రితో ఎలా ఉంటాడు. ఆయనతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటాడు అనే విషయాలను ఓ నటుడు ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

24
'అడవి రాముడు' సినిమా జ్ఞాపకాలు

ప్రభాస్ కెరీర్ బిగినింగ్ లో నటించిన చిత్రాలకు సంబంధించి విషయాలను.. ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్, నటుడు, ప్రభాస్ శ్రీను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.ముఖ్యంగా ఆయన సినిమాల్లోని సన్నివేశాల కోసం తన తండ్రి సూర్యనారాయణ రాజు అనుమతి తీసుకునేవారట. టాలీవుడ్ ప్రముఖ నటుడిగా, నిర్మాతగా సుపరిచితులైన ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కుటుంబం నుంచి వచ్చిన ప్రభాస్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన కెరీర్ ప్రారంభ దశలో చేసిన సినిమాలలో 'అడవి రాముడు' చిత్రం ఒకటి. ఈ చిత్రంలో ప్రభాస్ నటన, యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

34
కిస్ సీన్ కోసం తండ్రి అనుమతి!

సినిమాల్లో హీరోగా నటించేటప్పుడు రొమాంటిక్ సన్నివేశాలు, ముఖ్యంగా లిప్-లాక్ లేదా కిస్ సీన్లలో నటించాల్సి వస్తే నటులు కాస్త సంకోచించడం సహజం. అయితే ప్రభాస్ తన చిత్రాలలో అలాంటి సన్నివేశాలలో నటించడానికి ముందు ఏం చేసేవారో తెలుసా? 'అడవి రాముడు' సినిమాలో ఒక రొమాంటిక్ కిస్సింగ్ సీన్ వచ్చే సమయంలో, ప్రభాస్ నేరుగా ఫోన్ చేసి తన తండ్రిని అనుమతి కోరారట.

"డాడీ, నేను సినిమాలో కిస్ పెట్టొచ్చా?" అని అడగగా, ఆయన తండ్రి సరదాగా "పెట్టేయి నాన్న సినిమా కోసమేగా" అని చెప్పే వారట. ఆ తర్వాతే ప్రభాస్ ఆ సన్నివేశంలో నటించారని, ఆ తండ్రీకొడుకులు ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారో అని గుర్తు చేసుకున్నారు ప్రభాస్ శ్రీను.

44
తండ్రీకొడుకుల అన్యోన్యత

ప్రభాస్ తన కెరీర్ పరంగా ఎదగడంలో, ప్రతి విషయంలోనూ తన కుటుంబం ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్పది. ముఖ్యంగా తండ్రి సూర్యనారాయణ రాజుతో ప్రభాస్ చాలా సన్నిహితంగా ఉండేవారు. షూటింగ్ విషయాలను సైతం ఇంట్లో చర్చించుకోవడం, ఫుడ్ గురించి, కూడా ఎక్కువగా మాట్లాడుకునేవారట. ఇండస్ట్రీలో ఎంతటి పెద్ద స్టార్‌గా ఎదిగినప్పటికీ, తన కుటుంబం పట్ల ప్రభాస్ చూపించే గౌరవం, వారిపై ఉన్న ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే. పెదన్నాన్న కృష్ణంరాజు విషయంలో కూడా ప్రభాస్ ఎలా ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే.

Read more Photos on
click me!

Recommended Stories