ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. నందమూరి ఫ్యామిలిలో కొత్త వివాదానికి కేంద్రంగా మారినట్లు ఉన్నాయి. ఇప్పటికే నందమూరి అభిమానులు బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ చేసుకుంటున్నారు. గత నెలలో విజయవాడలో స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.