బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన కొన్ని పాన్ ఇండియా సినిమాలు కొన్ని వర్కౌట్ కాలేదు. మరికొన్ని బాగానే ఆడాయి. దీని గురించి తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 ఇలా ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ వందల కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్నవే. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. సినిమాకి హిట్ టాక్ వస్తే చాలు అలవోకాగా 1000 కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ అదే సమయంలో బాహుబలి తర్వాత ప్రభాస్ కి వరుస ఫ్లాపులు కూడా ఎదురయ్యాయి.
25
తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్
రాధే శ్యామ్, సాహో చిత్రాలు నిరాశ పరిచాయి. దీని గురించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులకు ఏమాత్రం నచ్చవు. తమ్మారెడ్డిచేసిన కామెంట్స్ ట్రోలింగ్ కి గురయ్యేలా, వివాదం అయ్యేలా ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి ముందుగా రాజమౌళి గురించి మాట్లాడారు.
35
రాజమౌళి మెజీషియన్
రాజమౌళి ఒకమెజీషియన్. తెలుగు సినిమాకు 1000 కోట్ల రుచి చూపించింది ఆయనే. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి మూవీ చేస్తున్నారు. ఈ సినిమా సులభంగా 1000, 2000 కోట్లు రాబడుతుంది. కానీ 5000 కోట్లు సాధించి హాలీవుడ్ మార్కెట్ తో పోటీ పడుతుందా లేక 10 వేల కోట్ల వరకు చేరుకొని హాలీవుడ్ మార్కెట్ నే తుడిచిపెట్టేస్తుందా అనేది చూడాలి. దానికోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని తమ్మారెడ్డి అన్నారు.
ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలి మంచి సినిమా.. కాదనలేం. కానీ ప్రభాస్ చించేసింది ఏమీ లేదు. హీరోగా బాగానే చేశాడు కానీ చించేసే రేంజ్ లో ఆయన పాత్ర లేదు. రాజమౌళి చేసిన మ్యాజిక్ కి డబ్బులు బాగా వచ్చాయి. దీనితో ప్రభాస్ మీద హైప్ పెంచేశారు. 1000 కోట్ల హీరో అని పిలవడం ప్రారంభించారు. దీనితో ప్రభాస్ నార్మల్ సినిమాలు చేయడం మానేశారు. ఆ హైప్ తో విపరీతమైన భారీ బడ్జెట్ లో సినిమాలు చేశారు.
55
అందుకే అవి అట్టర్ ఫ్లాప్
సలార్, కల్కి కొంత వరకు వర్కౌట్ అయ్యాయి. కలెక్షన్స్ వచ్చినా వారి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ. రాధేశ్యామ్, సాహో, రాజా సాబ్ డిజాస్టర్స్ అయ్యాయి. కానీ రాజా సాబ్ చిత్రాన్ని నార్మల్ గానే తక్కువ బడ్జెట్ లో చేయాలని ప్రభాస్ ప్రయత్నించారు. కానీ నిర్మాతలు మాత్రం ప్రభాస్ 1000 కోట్ల హీరో కాబట్టి ఆ రేంజ్ లోనే మూవీ ఉండాలని కోరినట్లు తెలిసింది. అయితే అది ఎంత వరకు వాస్తవమో తెలియదు. నిర్మాతలే పట్టుపట్టినట్లు వార్తలు వచ్చాయి. దీనితో ఆ సినిమా రేంజ్ ని పెంచారు. కానీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది అని తమ్మారెడ్డి అన్నారు.