Crazy Kalyanam 4 Days Collections: క్రేజీ కళ్యాణం 4 రోజుల కలెక్షన్లు.. గట్టి పోటీలోనూ స్టడీగా వసూళ్లు

Published : Oct 20, 2026, 09:25 AM IST

అనుపమా పరమేశ్వరన్‌, నరేష్‌, తరుణ్‌ భాస్కర్, అఖిల్‌ రాజ్‌ నటించిన `క్రేజీ కళ్యాణం` మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో తడబడింది. మరి సినిమాకి వస్తోన్న కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

PREV
13
ఫ్యామిలీ డ్రామాగా క్రేజీ కళ్యాణం

అనుపమా పరమేశ్వరన్‌, వీకే నరేష్‌, తరుణ్‌ భాస్కర్‌, అఖిల్‌ రాజ్‌(ఉడ్డెమారి) ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం `క్రేజీ కళ్యాణం`. నూతన దర్శకుడు బద్రప్ప గాజుల దీనికి దర్శకత్వం వహించారు. యారో సినిమాస్‌ పతాకంపై బూసం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్మించారు. అమ్మాయి పెళ్లి చుట్టూ తిరిగే కథాంశంతో ఫన్‌, ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. మరి వసూళ్లు ఎలా ఉన్నాయనేది చూస్తే.

23
క్రేజీ కళ్యాణం మూవీ 4 రోజుల కలెక్షన్లు

`క్రేజీ కళ్యాణం` మూవీ బాక్సాఫీసు వద్ద నిరాసంగా రన్‌ అవుతుంది. ఈ మూవీకి సోమవారం కేవలం రూ.17లక్షలు మాత్రమే రాబట్టింది. నాలుగు రోజుల్లో మొత్తంగా రూ.84లక్షలు వసూలు చేసింది. ఈ దసరా స్పెషల్‌గా రిలీజ్‌ అయిన చిత్రాల్లో అత్యంత డల్‌గా ఉన్నది ఈ సినిమా అనే చెప్పాలి. టాక్‌ పరంగా, కలెక్షన్ల పరంగా నీరసంగా ఉంది. అయితే రోజువారి కలెక్షన్లు మాత్రం స్టడీగా ఉండటం విశేషం. తెలంగాణ నేపథ్యంలో అమ్మాయి పెళ్లి చుట్టూ తిరిగే ఈ కథ ఫన్‌, ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. కానీ ఆశించిన స్థాయిలో ఫన్‌ వర్కౌట్‌ కాలేదు. ఎమోషన్స్ పండలేదు. అందుకే ఆడియెన్స్ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. మరి ఫెస్టివల్‌ తర్వాత అయినా ఈ సినిమా పుంజుకుంటుందేమో చూడాలి.

33
పోటీలో నలిగిపోయిన క్రేజీ కళ్యాణం

దీనికి తోడు పెద్ద సినిమాలు రిలీజ్‌ కావడంతో ఆ ప్రభావం `క్రేజీ కళ్యాణం`పై పడింది. రజనీకాంత్‌ `జైలర్‌ 2`, విజయ్‌ దేరవకొండ, రష్మిక మందన్నాల `రణబాలి` చిత్రాల మధ్య నలిగిపోయిందని చెప్పొచ్చు. సోలోగా వచ్చి ఉంటే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బెటర్‌గానే పర్‌ఫామ్‌ చేసేది. కానీ పోటీలో రావడంతో సత్తా చాటలేకపోయింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories