తమ్మారెడ్డి భరద్వాజ చెబుతూ, మేం ఎంతో కష్టపడి సినిమా తెరకెక్కించామని, మా సినిమాని చూడాలని ఆడియెన్స్ కి చెప్పాలని, ఏ యూనిట్ అయినా తమ సినిమాని ఆడియెన్స్ లో ప్రమోట్ చేసుకుంటే సరిపోతుందని, అంతేకానీ మనం చిటికేస్తే, ఆడియెన్స్ ఇలాంటి సమాధానమే చెబుతారని తెలిపారు. మన యాక్షన్ పైనే ఆడియెన్స్ రియాక్షన్ ఆధారపడి ఉంటుందని చెప్పారు. సినిమా విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా ఎగిరెగిరి పడవద్దన్నారు. దేశాన్ని తగలెడదాం, ఊరుని తగలెడదాం అంటూ చివరికి మనల్ని తగలెడతారని చెప్పారు. అలా చేస్తే ఇలాంటి అనుభవాలే ఫేస్ చేయాల్సి వస్తుందని `లైగర్` చిత్రాన్ని ఉద్దేశించి తమ్మారెడ్డి తెలిపారు.