ఈసారి పవన్, మహేష్ ఇద్దరినీ కలిపి .. ఒక్క మొగోడు కూడా లేడా, విరుచుకుపడ్డ తమ్మారెడ్డి

Published : Apr 19, 2023, 11:58 AM IST

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేయడంతో ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది.

PREV
16
ఈసారి పవన్, మహేష్ ఇద్దరినీ కలిపి .. ఒక్క మొగోడు కూడా లేడా, విరుచుకుపడ్డ తమ్మారెడ్డి

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేయడంతో ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. రీసెంట్ గా తమ్మారెడ్డి ఆర్ఆర్ఆర్ చిత్రంపై విమర్శలు చేస్తూ చేసిన వ్యాఖ్యలు అభిమానులని ఆగ్రహానికి గురిచేశారు. రాఘవేంద్ర రావు లాంటి ప్రముఖులు కూడా తమ్మారెడ్డిని విమర్శించారు. 

26

తాజాగా తమ్మారెడ్డి మరోసారి ఇండస్ట్రీపై తన ఆగ్రహం ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. నేను టాలీవుడ్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతున్నాను అని చాలా మంది అంటున్నారు. బుద్ది లేనివాళ్లే అలా మాట్లాడేది. ఇండస్ట్రీని తక్కువ చేయడం వల్ల నాకేం వస్తుంది ? 

36

ఇండస్ట్రీకి అవసరమైనప్పుడు మహేష్ బాబు రావడం లేదు అని చాలా మంది విమర్శిస్తుంటారు. అసలు మహేష్ బాబు ఎందుకు రావాలి ? మహేష్ బాబుకు కష్టం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఏ ఒక్కరైనా అండగా నిలబడ్డారా ? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. మహేష్ బాబు అర్జున్ సినిమా పైరసీపై పోరాటం చేసినప్పుడు ఒక్కడు కూడా వెళ్ళలేదు. 

46

ఆయన ఛాంబర్ లో కూర్చుంటే వెంట ఒక్కరు కూడా లేరు. నేను ఛాంబర్ కి వెళ్ళినప్పుడుద్ అక్కడ మహేష్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. పవన్ కళ్యాణ్ మాత్రం ఐయామ్ విత్ యు అని సపోర్ట్ చేశారు. కనీసం పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి రాలేదు. 

56

మహేష్ ఛాంబర్ లో ఉంటే పోలీసులు హడావిడి చేసారు. దానిని అడగడానికి ఇండస్ట్రీ నుంచి ఒక్క మొగోడు కూడా లేడు. మళ్ళి మొగోడు అని మాట్లాడానని కాంట్రవర్సీ చేస్తారేమో అని తమ్మారెడ్డి అన్నారు. నేను మంచి చెప్పినా చెడుగా తీసుకుంటే నేనేం చేస్తాను. 

66

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాలు నిజం కావచ్చు. కానీ అక్కడ మాట్లడడం కరెక్ట్ కాదు అని చెప్పాను. దానిపై కూడా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం వల్ల రిపబ్లిక్ సినిమా పోయింది. ఓపెనింగ్స్ రాలేదు అని తమ్మారెడ్డి తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories