గబ్బర్ సింగ్ తరువాత వరుస సినిమాలు చేసి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరింది శృతిహాసన, ఆల్ మోస్ట్ తెలుగులో టాప్ హీరోలందరికి జోడీగా నటించింది. ఇక ఇప్పుడు కూడా ప్రభాస్ తో సలార్, బాలయ్యతో ఒక మూవీ.. మెగాస్టార్ చిరంజీవితో మరో మూవీ చేస్తోంది శ్రుతి హాసన్. కమల్ హాసన్ వారసురాలిగా వచ్చి.. టాలీవుడ్ లో కూడా సత్తా చూపించింది.