విజయ్ దేవరకొండ, సమంతలది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరూ తొలిసారి మహానటి చిత్రంలో కలసి నటించారు. ఇప్పుడు వీరిద్దరూ కలసి నటిస్తున్న పూర్తి స్థాయి చిత్రం 'ఖుషి'. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ప్రారంభం అయింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.