పవన్, మహేష్, బాలయ్య, వెంకీ లకు చుక్కలు చూపించారుగా..అరవోళ్ల దెబ్బ అలాగే ఉంటుంది మరి.. 

Published : Jun 07, 2024, 10:16 AM ISTUpdated : Jun 07, 2024, 10:18 AM IST

పొరుగింటి పుల్లగూర రుచి అనే సామెత తెలుగులో ఉంది. మన టాలీవుడ్ హీరోలకి అది కొన్నిసార్లు బాగా సరిపోతుందేమో. తమిళ డైరెక్టర్లని నమ్ముకుని టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా సార్లు దెబ్బై పోయారు.

PREV
19
పవన్, మహేష్, బాలయ్య, వెంకీ లకు చుక్కలు చూపించారుగా..అరవోళ్ల దెబ్బ అలాగే ఉంటుంది మరి.. 

పొరుగింటి పుల్లగూర రుచి అనే సామెత తెలుగులో ఉంది. మన టాలీవుడ్ హీరోలకి అది కొన్నిసార్లు బాగా సరిపోతుందేమో. తమిళ డైరెక్టర్లని నమ్ముకుని టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా సార్లు దెబ్బై పోయారు. పవన్, బాలకృష్ణ, మహేష్ లాంటి స్టార్ హీరోలతో కొందరు యువ హీరోలకు కూడా తమిళ డైరెక్టర్ల వల్ల డిజాస్టర్ చిత్రాలు పడ్డాయి. 

29

విష్ణు వర్ధన్ - పంజా 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తప్పనిసరిగా హిట్ అవసరం అనుకుంటున్న టైంలో తమిళ డైరెక్టర్ విష్ణు వర్ధన్ పంజా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ దారుణంగా నిరాశపరిచింది. విష్ణు వర్ధన్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా ప్రజెంట్ చేశారు అనే చిన్న సంతృప్తి తప్ప ఫ్యాన్స్ కి ఇంకేమి మిగలలేదు. 

39
spyder

మురుగదాస్ - స్పైడర్ 

సౌత్ లో అగ్రదర్శకులలో మురుగదాస్ ఒకరు. ఆయన ప్రతిభని శంకించలేం. కానీ తెలుగులో మాత్రం ఆయనకి ఎందుకో కలసి రావడం లేదు. చిరంజీవితో తెరకెక్కించిన స్టాలిన్ చిత్రం యావరేజ్. మహేష్ బాబుతో భారీ హిట్ కొడతాడు అనుకుంటే.. బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. మహేష్ కెరీర్ లోనే భారీ నష్టాలు మిగిల్చిన చిత్రం స్పైడర్. 

49

లింగుస్వామి - వారియర్ 

లింగుస్వామి చిత్రాలు డీసెంట్ గా ఉంటాయి. కానీ రామ్ పోతినేనితో తెరకెక్కించిన వారియర్ చిత్రం వర్కౌట్ కాలేదు. రొటీన్ టెంప్లేట్ లో తెరకెక్కించిన చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు. 

59

ఎస్ జె సూర్య  - నాని

పవన్ తో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించడంతో డైరెక్టర్ ఎస్ జె సూర్యకి మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య చేసిన సైంటిఫిక్ ప్రయోగం పూర్తిగా బెడిసికొట్టింది. మహేష్ ఇమేజ్ కి ఈ చిత్రం ఏమాత్రం వర్కౌట్ కాలేదు. 

69

వెంకట్ ప్రభు - కస్టడీ 

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ వెంకట్ ప్రభు. నాగ చైతన్యతో వెంకట్ ప్రభు పొలిటికల్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు. కస్టడీ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. 

79
Nota Public Meet

ఆనంద్ శంకర్ - నోటా 

తమిళ యువ దర్శకుడు ఆనంద్ శంకర్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నోటా. ఇది కూడా పొలిటికల్ థ్రిల్లర్. విజయ్ దేవరకొండ హీరో అనే అంశం పక్కన పెడితే ఈ చిత్రంలో అందరూ తమిళ ఆర్టిస్టులే నటించారు. తమిళ ఫ్లేవర్ ఎక్కువ కావడంతో ఈ మూవీ కూడా తెలుగు ఆడియన్స్ కి నచ్చలేదు. 

89

ధరణి - బంగారం 

పవన్ కళ్యాణ్ కి షాకిచ్చిన మరో తమిళ డైరెక్టర్ ధరణి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బంగారం చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రంలో ధరణి చాలా అతిగా సన్నివేశాలని తెరకెక్కించడం ప్రేక్షకులకి నచ్చలేదు. 

99

పి వాసు- మహారథి , నాగవల్లి 

సీనియర్ డైరెక్టర్ పి వాసు 'చంద్రముఖి తరహాలో అద్భుతం చేస్తారనుకుంటే.. వెంకటేష్, బాలయ్య ఇద్దరికీ ఫ్లాప్ చిత్రాలు ఇచ్చారు. బాలయ్యతో తెరకెక్కించిన మహారథి, వెంకటేష్ తో రూపొందించిన నాగవల్లి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. 

Read more Photos on
click me!

Recommended Stories