మలయాళం యంగ్ హీరోయిన్ మమితా బైజు(Mamitha Baiju) తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. తనను ప్రముఖ దర్శకుడు కొట్టాడని చెప్పుకొచ్చింది. అందుకే సూర్య నటించాల్సిన ఆ చిత్రం నుంచి తప్పుకున్నట్టు తెలిపింది.
మలయాళ యంగ్ హీరోయిన్ మమితా బైజు పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ప్రముఖ తమిళ దర్శకుడిపై షాకింగ్ కామెంట్స్ చేయడమే అందుకు కారణం.. ఇంతకీ ఆమె ఏమని చెప్పిందంటే..
26
‘ప్రేమలు’ (Premalu) అనే చిత్రంతో ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించుకుంది. ప్రేమలు చిత్రం కాస్తా మంచి రెస్పాన్స్ ను దక్కించుకోవడం... మమితా బైజు నటనతోనూ ఆకట్టుకుంది.
36
ప్రస్తుతం పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా మమితా ప్రముఖ తమిళ దర్శకుడు బాలా (Director Bala) తనను కొట్టారని చెప్పింది. దీంతో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
46
దర్శకుడు బాలా నుంచి త్వరలో రాబోతున్న చిత్రం ‘వనంగాన్’ (Vangaan) నుంచి తప్పుకున్నట్టు చెప్పింది. షూటింగ్ సమయంలో దర్శకుడు బాలా ఆమెను కొట్టాడమే కారణంగా చెప్పింది. సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు కొట్టారంది.
56
ముందుగా ‘వనంగాన్’లో హీరోగా సూర్య ఎంపికయ్యారు. కానీ ఆ తర్వాత ఆ చిత్రం నుంచి ఆయన తప్పుకున్నారు. సూర్య స్థానంలో ప్రముఖ నటుడు అరుణ్ విజయ్ (Arun Vijay) ఎంట్రీ ఇచ్చారు.
66
త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో 'వనంగాన్' షూటింగ్ అనుభవం గురించి నటి మమిత బైజు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.