తమిళ హీరోయిన్ ప్రియాంక మోహన్ తొలుత కన్నడలో ‘ఒంద్ కతే హెల్లా’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఈ సుందరి నటన, గ్లామర్ కు టాలీవుడ్ ఫిదా అవడంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
26
ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో (Nani)తో కలిసి ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం అవరేజ్ గా ఆడినా.. ప్రియాంక అరుళ్ మోహన్ కు మాత్రం మంచి గుర్తింపును తెచ్చింది. ఆ వెంటనే హీరో శర్వానంద్ తో కలిసి ‘శ్రీకారం’లో నటించింది. రెండు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.
36
ఇటీవల తమిళ స్టార్ హీరో సూర్య సరసన ‘ఈటీ’లో నటించింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ తో కలిసి ‘డాన్’లో కనిపించింది. ఈ మూవీ మంచి సక్సెస్ ను అందుకుంది. ఇప్పటి వరకు ప్రియాంక నటించి చిత్రాల్లో Don మూవీ మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఆమె నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.
46
ఈ చిత్రానికి గాను ప్రియాంక పలు అవార్డులను కూడా అందుకుంది. అందంలో, నటనలో ఇప్పటి వరకు మంచి మార్కులు పడుతున్నాయి. వాటితోనే తమిళ స్టార్ సూర్యతో కలిసి ‘ఈటీ’లో నటించి అలరించింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలోనూ తెగ హల్ చల్ చేస్తోంది.
56
ఈ పిక్స్ లో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్, మ్యాచింగ్ లెహంగాలో మతిపోగొడుతోంది. ట్రెడిషనల్ లుక్ లో ఈ బ్యూటీ కుర్రాళ్లను గుండెల్ని కొల్లగొడుతోంది. ప్రియాంక లేటెస్ట్ ఫొటోషూట్లు అందరినీ ఆకట్టుకుంటోంది.
66
మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తున్న ప్రియాంక ఇటీవల గ్లామర్ డోస్ కూడా పెంచుతూ వస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో స్టన్నింగ్ స్టిల్స్ ఇస్తూ మెస్మరైజ్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉండటంతో పిక్స్ వైరల్ అవుతున్నాయి.