హీరోయిన్ బట్టలపై పబ్లిక్ గా నటుడి కామెంట్స్.. మీ బుద్ది మారదా అంటూ మండిపడ్డ చిన్మయి

Published : Nov 10, 2022, 05:17 PM IST

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది.

PREV
16
హీరోయిన్ బట్టలపై పబ్లిక్ గా నటుడి కామెంట్స్.. మీ బుద్ది మారదా అంటూ మండిపడ్డ చిన్మయి

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తరచుగా తన గళం వినిపిస్తూ ఉంటుంది. మహిళలని అవమానించేలా చిన్న సంఘటన జరిగినా చిన్మయి ఊరుకోవడం లేదు. 

26

ఇటీవల చెన్నైలో 'ఓ మై ఘోస్ట్' అనే చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ చిత్రంలో శృంగార తార సన్నీలియోన్, యువ నటి దర్శ గుప్తా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నటుడు సతీష్ కూడా చిన్న పాత్రలో నటించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సతీష్ మాట్లాడుతూ నటి దర్శ గుప్తా హాట్ కామెంట్స్ చేశాడు. 

 

36

సన్నీలియోన్ ఎక్కడో ముంబై నుంచి తమిళ చిత్ర పరిశ్రమకు వచ్చింది. మన సంస్కృతికి తగ్గట్లుగా ఆమె ఎంతో అందంగా బట్టలు వేసుకుంది. మరోవైపు మన కోయంబత్తూర్ పిల్ల దర్శ గుప్తాని చూడండి' అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. సన్నీలియోన్ చీరకట్టులో మెరిసింది. దర్శ గుప్తా మాత్రం ఎక్స్ పోజింగ్ చేస్తూ మోడరన్ డ్రెస్ లో మెరిసింది. 

46

అందుకే పాయింట్ చేస్తున్నా అంటూ సతీష్ వేదికపై హాట్ కామెంట్స్ చేశాడు. దీనితో ప్రీ రిలీజ్ వేడుకకి హాజరైన అభిమానులు ఈలలు కేకలు వేశారు. దర్శ గుప్తా ఈ కామెంట్స్ ని సరదాగానే తీసుకుని చిరునవ్వులు చిందించింది. 

56

అయితే చిన్మయి మాత్రం ఒక రేంజ్ లో మండి పడుతూ ట్వీట్ చేసింది. ఇలాంటి బుద్ది మగాళ్లు ఎప్పుడు మార్చుకుంటారు అంటూ ఫైర్ అయింది. ఒక మహిళని టార్గెట్ చేస్తూ.. ఆమె సంసృతికి తగ్గట్లుగా బట్టలు వేసుకోవడం లేదని వేదికపై ఒక మగాడు వ్యాఖ్యానించడం.. దానికి జనాలు ఈలలు కేకలు వేయడం ఏమాత్రం అర్థం కానీ అంశం. 

66

ఇది సరదాగా తీసుకోవలసిన అంశం కాదు అంటూ చిన్మయి సీరియస్ అయింది. మరి తన వ్యాఖ్యలపై సతీష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. నటి దర్శ గుప్తా.. సన్నీలియోన్ తో కలసి దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

click me!

Recommended Stories