అజిత్ తెల్లజుట్టుకు కారణం అదేనా..? స్టార్ హీరోకు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయా..? తమిళ నటుడి సంచలన వ్యాఖ్యలు

Published : Mar 13, 2024, 12:33 PM IST

తమిళ స్టార్ హీరో అజిత్ కు ఇంతకు ముందే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా..?  తమిళ నటుడు రంగనాథన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఎంత వరకూ నిజం..?   

PREV
17
అజిత్ తెల్లజుట్టుకు కారణం అదేనా..? స్టార్ హీరోకు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయా..? తమిళ నటుడి సంచలన వ్యాఖ్యలు
ajith

ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నటుడు అజిత్ కుమార్ ఈరోజు కేవలం తన నమ్మకంతో 100 కోట్ల హీరోగా ఎదిగాడు.   నటుడిగా ఎంతో ఉన్నత స్థానానికి  ఎదిగాడు అజిత్.. తనకు వీలైనప్పుడల్లా ఇతరులకు సహాయం చేయాలనే హృదయం అతనికి ఉంది. ఇతరుల ఆనందాన్ని చూసి ఆనందించే వ్యక్తి అని  అజిత్ కు పేరు ఉంది. 
 

27

గత సంవత్సరం అజిత్ నుంచి తునీవు' విడుదలైంది, అయితే ఈ చిత్రం తర్వాత, దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ నటించడానికి కమిట్ కావడంతో సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. చివరకు అజిత్, లైకా ఇద్దరూ విక్కీ కథతో సంతృప్తి చెందకపోవడంతో విక్కీని సినిమా నుంచి తప్పించారు.
 

37

విక్కీకి బదులు దర్శకుడు మిజ్ తిరుమేని అజిత్ తదుపరి సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. విడశాలి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతానికి పైగా కంప్లీట్ కావడంతో మార్చి 15న అజర్ బైజాన్ లో 3వ దశ షూటింగ్ ని కొనసాగించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. 
 

47

అజర్‌బైజాన్‌కు బయలుదేరే ముందు, అజిత్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో పూర్తి శారీరక పరీక్ష చేయించుకున్నాడు. అప్పుడే ఇన్‌ఫ్రా-ఇయర్ నాడిలో చిన్న నాడ్యూల్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, దీని కోసం అతను చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాకముందే... రకరకాల పుకార్లు వ్యాపించి ఉత్కంఠ రేపుతుండటంతో. అనంతరం అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర వివరణ ఇచ్చి రూమర్ కు ముగింపు పలికారు.
 

57

ఈ నేపథ్యంలో అజిత్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు తమిళ వివాదాస్పద నటుడు బైల్వాన్. అజిత్‌కు కూడా కంటి సమస్య ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు  దానికి ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎంతో మందికి సహాయం చేసే అజిత్ చాలా మంచి వ్యక్తి అని బెయిల్వాన్ కూడా కొనియాడాడు.
 

67

ఒకసారి అజిత్‌ని తన ఆఫీసులో కలవడానికి వెళ్లి రోజు... ఆయన ఎక్కువగా టాబ్లేట్స్ వాడటం చూశానంటూ వెల్లడించారు. అంతే కాదు అందుకు తాన ఎంతో బాధపడుతున్నట్టు వెల్లడించాడు. అంతే కాదు అజిత్‌కి ఇప్పటి వరకు 8 ఆపరేషన్లు జరిగాయి. వెన్నెముకకు గాయమైంది.  అందుకే  డాన్స్ విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలట. 
 

77

ఇంకా.. అజిత్ తెల్లజుట్టుకు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి, తీసుకుంటున్న మందులే కారణం అని అంటున్నారు బైల్వాన్. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. ఆయన వాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి. రంగనాథన్ ఈ విషయాలను  తాజాగా ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 

click me!

Recommended Stories