Tamannah: రోబో డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మిల్కీ బ్యూటీ.. హాట్‌ ఆంటీ అంటూ షాకిస్తున్న నెటిజన్లు

Published : Dec 10, 2021, 07:52 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా కుర్రాళ్లకి షాకిస్తుంది. జయాపజయాలకు అతీతంగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది. హాట్‌ క్వీన్‌గా మెరిసే తమన్నా రూట్‌ మార్చింది. గ్లామర్‌ స్టయిల్‌ మార్చి మతిపోగొడుతుంది. వైరల్‌గా మారింది.   

PREV
17
Tamannah: రోబో డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మిల్కీ బ్యూటీ.. హాట్‌ ఆంటీ అంటూ షాకిస్తున్న నెటిజన్లు

తమన్నా లేటెస్ట్ ఫోటోలతో షాకిస్తుంది. రోబోలను తలపించే సిల్వర్‌ కలర్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. ఆకాశం నుంచి దిగివచ్చిన తారల మెరుస్తుంది. నెట్టింట వైరల్‌గా మారింది. నెవర్‌ బిఫోర్‌ అనేలా తమన్నా ఈ నయా గెటప్‌లో మంత్రముగ్దుల్ని చేస్తుందంటే అతిశయోక్తి కాదు. తమన్నా నయా స్టయిల్‌ని చూసేందుకు ఎగబడుతున్నారు. దీంతో మిల్కీ బ్యూటీ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేసేపనిలో బిజీగా ఉందని చెప్పాలి. 

27

తమన్నా ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏంజెల్‌, బ్యూటీఫుల్‌, సో హాట్‌ అంటూ రెగ్యూలర్‌ కామెంట్లు చేస్తూ, ఈ సారి కొత్త కామెంట్లతో తమన్నాకి షాకిస్తున్నారు. `హాట్‌ అంటీ` అంటూ పోస్ట్ లు పెట్టడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. నెటిజన్లు ఇలా సెటైర్లు వేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
 

37

తమన్నా స్టార్‌ హీరోయిన్‌. హిందీలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, తెలుగులో మాత్రం ఇప్పటికే స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. జయాపజయాలకు అతీతంగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ భామ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. 
 

47

గ్లామర్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న తమన్నా ఇటీవల తన పాత్రల ఎంపికలో మార్పు కనిపిస్తుంది. గ్లామర్‌కి ప్రయారిటీ ఇస్తూనే బలమైన పాత్రల వైపు చూస్తుంది. ఇటీవల ఆమె నటించిన `మ్యాస్ట్రో` చిత్రమే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇందులో నెగటివ్‌ రోల్‌ చేసి అభిమానులకు షాకిచ్చింది తమన్నా. 
 

57

మరోవైపు ప్రస్తుతం `గుర్తుందా శీతాకాలం` చిత్రంలోనూ మరో బలమైన పాత్ర పోసిస్తుంది తమన్నా. ఇందులో సత్యదేవ్‌ పాత్రని మించి తమన్నా పాత్ర ఉండబోతుందని సమాచారం. అలాగే `ఎఫ్‌3`లోనూ గ్లామర్‌, నటనకు స్కోప్‌ ఉన్న రోల్‌లో కనిపించబోతుందీ మిల్కీ అందాల సోయగం. 
 

67
Tamannaah

Tamannaah

దీంతోపాటు మెగాస్టార్‌ చిరంజీవితో ఆడిపాడబోతుంది తమన్నా. `భోళాశంకర్‌`లో హీరోయిన్‌గా ఎంపికైంది. చిరుతో `సైరా` చిత్రంలో ఆడిపాడింది. అందులో లక్ష్మీ అనే బలమైన పాత్రని పోషించింది. సినిమాలో ఆమె పాత్ర హైలైట్‌గా నిలవడం విశేషం. అన్ని పాత్రలకంటే తమన్నా పాత్రకే మంచి ప్రశంసలు దక్కడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. 

77

తమన్నా ఇటీవల జెమినీ ప్రసారమైన `మాస్టర్‌చెఫ్‌` వంటల ప్రోగ్రామ్‌కి హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే. అయితే తమన్నా హోస్టింగ్‌ సమయంలో ఆశించిన స్థాయిలో రేటింగ్‌ రాకపోవడంతో ఆమెని తప్పించారు. ఆమె స్థానంలో అనసూయని తీసుకున్నారు. కానీ రేటింగ్‌లో ఏమాత్రం మార్పులేదని టాక్. ఈ విషయంలో నిర్వహకులపై కోర్ట్ ని కూడా ఆశ్రయించిందని సమాచారం. ఇలా సినిమాలతోపాటు టీవీ షోల ద్వారా కూడా మెప్పించే ప్రయత్నం చేస్తుంది తమన్నా. వెబ్‌ సిరీస్‌లు చేయడానికి కూడా సిద్ధంగానే ఉంది. ఇప్పటికే ఆమె ఓ రెండు వెబ్‌ సిరీస్‌లు చేసింది.

also read: Sreemukhi:వింటేజ్ డ్రెస్ లో శ్రీముఖి నయా అవతార్... లూజు ప్యాంటులో క్రేజీగా ఉన్న అమ్మడు

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories