తమన్నా ప్రస్తుతం `మాస్టర్‌చెఫ్` షోతో బిజీగా ఉంది. దీని కోసం రోజూ సరికొత్త ట్రెండీ వేర్‌లో హోయలు పోతుంది. అభిమానులను ఆకట్టుకుంటుంది. తన అందాలతో కనువిందు చేస్తుంది.
లేటెస్ట్ గా తమన్నా బ్లాక్ ఫ్లోరల్ గౌన్‌లో హోయలు పోయింది. పర్‌ఫెక్ట్ బాడీ కొలతలు చూపిస్తూ ఈ మిల్కీ బ్యూటీ ఇచ్చిన పోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల మతిపోగొడుతున్నాయి.
మరోవైపు తమన్నా ఫ్యాషన్ పరంగానూ స్పెషల్‌గా నిలుస్తుంది. ఫ్యాషన్‌కి సరికొత్త అర్థాన్నిస్తున్నారు. ఆయా మోడల్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. లక్షల ఫాలోవర్స్ కలిగిన తమన్నా ఒక్క పోస్ట్ పెడితే అది తన ఫాలోవర్స్ కి మొత్తం రీచ్ అవుతుంది.
ఈ నేపథ్యంలోఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నతమన్నా తాజాగా ధరించిన డ్రెస్ విషయంలో వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా ఈ డ్రెస్‌ఖరీదు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
లేటెస్ట్ ఫోటోషూట్ కోసం నటి తమన్నా సైతం అత్యంత ఖరీదైన దుస్తుల్ని ధరించారు. ఆమె ఆ డ్రెస్‌కు పెట్టిన డబ్బుతో ఓ బేసిక్ మోడల్ కారు కొనుగోలు చేయవచ్చని ఫ్యాషన్ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు.
ఫొటోషూట్స్ కోసం ఆమె ధరించిన డ్రెస్సుల్లో నలుపు రంగు గౌను అందర్నీ ఎంతో ఆకర్షించింది. దీంతో దాని ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలని కొంతమంది భావించారు. `FarFetch.com` అనే వెబ్‌సైట్‌లో ఆ డ్రెస్ గురించి సెర్చ్ చేయగా.. ధర తెలుసుకుని ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే దాని ధర సుమారు 5 వేల యూఎస్ డాలర్లు(నాలుగు లక్షల) వరకు ఉంటుందని సమాచారం.
తమన్నా ప్రస్తుతం సినిమాలతోపాటు, వెబ్‌సిరీస్‌లు, టీవీ షో చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు `ఎఫ్3`, `మ్యాస్ట్రో`, `గుర్తుందా శీతాలకాలం`, `సీటీమార్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.