Tamannaah: ప్రియుడితో తమన్నా పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Published : Nov 14, 2023, 03:18 PM IST

పెళ్ళిపీఠలెక్కడానికి రెడీ అవుతుంది తమన్నా భాటియా.. ప్రేమించిన ప్రియుడితో.. తమ్మూ బేబి మూడు ముళ్ళు వేయించుకోబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి పెళ్ళి డేట్ ఎప్పుడంటే..?   

PREV
18
Tamannaah: ప్రియుడితో తమన్నా పెళ్లి  డేట్ ఫిక్స్..  ఎప్పుడంటే..?
photo credit - tamannaah instagram

వరుసగా సినిమాలు చేస్తూ..సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది.సీనియర్ హీరోయిన్ తమన్నా. హీరోయిన్ గా కెరీర్ అయిపోయింది అనుకున్నటైమ్ లో.. ఉప్పెనలా దూసుకొచ్చింది.  సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది.  ఈమధ్య వరుస అవకాశాలు సాధిస్తోంది తమన్నా.  సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపిస్తోంది. 

28

వరుసగా సినిమాలు చేస్తున్న తమన్నా..  ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో ఎటువంటి వివాదాలు లేకుండా తన కెరీర్ ను కొనసాగిస్తుంది. అయితే ఆమధ్య మాత్రం  తమన్నా ప్రేమలో పడి అందరికి షాక్ ఇచ్చింది.  కొన్ని నెలల క్రితం  బాలీవుడ్ నటుడు, తెలుగు వ్యక్తి అయిన  విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ లో ఉంది అని వార్తలు వచ్చాయి. ఓ పార్టీలో తమన్నా, విజయ్ కిస్సింగ్ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. 

38

తమన్నా, విజయ్ వర్మ ఫోటోలు  లీక్ అవ్వగా ఈ విషయం వైరల్ అయ్యాయి.. అప్పటి నుంచి వీరు ఎక్కడికి వెళ్లినా.. ప్రేమ పెళ్ళికి సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. దాంతో  బాలీవుడ్ లో తమన్నా అండ్ విజయ్ వర్మ కపుల్ హాట్ టాపిక్ అయ్యిపోయారు. ముందుగా వీరిద్దరి ప్రేమ రూమర్లు చక్కర్లు కొట్టడం, ఆ తరువాత వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో షికార్లు కొట్టడంతో బాగా ట్రెండ్ అయ్యారు. 
 

48

ఇక వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2  వంటి అడల్ట్ సినిమాలో నటించి రొమాన్స్ చేయడంతో మరింత వైరల్ అయ్యారు. ఈ విషయంలో తమన్నా అయితే కాస్త ఘాటుగానే స్పందిస్తూ వస్తోంది. ఇక ఒక టైమ్ లో ఈ రూమర్స్ పై ఇద్దరూ స్పందించి.. అవును మేము ప్రేమలో ఉన్నాం, డేటింగ్ చేస్తున్నాం అని క్లారిటీ ఇస్తూ వారి ప్రేమ గురించి బయట పెట్టారు.

58

తమన్నా విజయ్ వర్మ ప్రస్తుతం బయట తిరుగుతూ.. తమ సినిమాలు తాముచేసుకుంటూ..లవ్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఒక సారి మాత్రం  తమన్నా.. పెళ్లి చేసుకోవాలి అని రూల్ ఉందా అని ఘాటుగా స్పందించింది.  కాని ఈమధ్య వీరి పెళ్ళికి సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 
 

68
Vijay Varma

వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ అంతా కొంచెం లేట్ అయినా ప్రేమించి లేటెస్ట్ గా పెళ్లి చేసేసుకుంటున్నారు. తమన్నా కూడా ఇప్పుడు ఇదే బాటలో వెళ్లనుంది. ప్రస్తుతం తమన్నా, విజయ్ వర్మ చేతిలో ఉన్న సినిమాల్లో సెట్స్ మీద ఉన్నవి  కొన్ని ఉన్నాయి. అవి కంప్లీట్ అవ్వగానే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 

78
Tamannaah bhatia and vijay varma

వీరి సినిమాలు కంప్లీట్ అయ్యే సరికి రెండు మూడు నెలలు పైనే పడుతుందట. అందుకే..  వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతోంది. ప్రస్తుతం తమన్నా 33 లో ఉన్నాడు.. తమ్మూ  పై 4 ఏళ్ల పెద్ద విజయ్ వర్మ. విజయ్  37 ఏళ్ళ వయస్సులో ఉన్నారు. అయితే ఇంకా లేట్ చేయకుండా పెళ్లి చేసుకోవాలని వారు డిసైడ్ అయ్యారట. 

88

అంతే కాదు వీరి పెళ్లికి కారణం కూడా లేకపోలేదు.  ఇటీవల తమన్నా ఇంట్లో పెళ్లి చేసుకోమని ఎక్కువ ఫోర్స్ చేస్తుండటంతో వారి ప్రేమని పెళ్లి పీటలకు తీసుకువెళ్ళడానికి రెడీ అవుతున్నారట స్టార్స్. అయితే దీనిపై అధికారికంగా తమన్నా, విజయ్ వర్మ స్పందించలేదు. మరి మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి.
 

Read more Photos on
click me!

Recommended Stories