Tamannaah Marriage: పెళ్లికి టైమ్‌ ఫిక్స్ చేసుకున్న తమన్నా.. మిల్కీ బ్యూటీ ప్లాన్‌ అదిరింది..

Published : Apr 10, 2022, 10:30 AM IST

మిల్కీ బ్యూటీగా ఫేమస్‌ అయిన తమన్నా ఎట్టకేలకు మ్యారేజ్‌పై స్పందించింది. తాను ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుందో క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆమె మ్యారేజ్‌పై వస్తోన్న రూమర్స్ కి చెక్‌ పెట్టింది.   

PREV
15
Tamannaah Marriage: పెళ్లికి టైమ్‌ ఫిక్స్ చేసుకున్న తమన్నా.. మిల్కీ బ్యూటీ ప్లాన్‌ అదిరింది..

తమన్నా దాదాపు పదిహేనేళ్లుగా టాలీవుడ్‌లో రాణిస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఆమెని స్టార్‌ని చేసింది. ఆమెకో లైఫ్‌ ఇచ్చింది. నార్త్‌ నుంచి వచ్చిన ఈ బ్యూటీని బాలీవుడ్‌ పట్టించుకోలేదు. కానీ తెలుగు తెర ఆదరించి స్టార్‌ హీరోయిన్‌ని చేసింది. తమన్నా సైతం తెలుగులో సినిమాలకే ప్రయారిటీ ఇస్తుంది. గ్లామర్‌ రోల్స్, ఐటెమ్‌ సాంగ్‌లు చేస్తూ రాణిస్తుంది.

25

తమన్నా అంటే ఆమె మిల్కీ అందాలే గుర్తొస్తాయి. తీగలాంటి నడుము, బెల్లీ అందాలే ఎక్కువగా ఫేమ్‌. మేకర్స్ కూడా ఆమెని అదే యాంగిల్‌లో ప్రజెంట్‌ చేశారు. అయితే ఆమెలో అద్భుతమైన నటి ఉన్నారనే విషయాన్ని చాలా తక్కువ మంది మేకర్సే గుర్తించారు. ఇటీవల `మ్యాస్ట్రో` చిత్రంలో తానేంటో చూపించింది తమన్నా. అంతేకాదు చాలా సినిమాల్లో ఆమె నటిగానూ మెప్పించింది. కానీ అది హైలైట్‌ కాలేదు. 

35

టాలీవుడ్‌లోకి 2005లో `శ్రీ` చిత్రంతో అడుగుపెట్టింది. దాదాపు 17ఏళ్లుగా హీరోయిన్‌గా రాణిస్తుంది తమన్నా. ఇప్పటి వరకు దాదాపు యాభైకి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ తమన్నాకి భారీ సినిమాల ఆఫర్లుండటం విశేషం. ప్రస్తుతం ఆమె చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు `ఎఫ్‌ 3`లో నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు `గుర్తుందా శీతాకాలం` సైతం రిలీజ్‌కి ఉంది. హిందీలో రెండు చిత్రాలున్నాయి. 

45

ఇదిలా ఉంటే మూడు పదులు దాటిన తమన్నా పెళ్లిపై రకరకాల వార్తలొస్తున్నాయి. చాలా రోజులుగా ఆమె మ్యారేజ్‌ కి సంబంధించిన రూమర్స్ వినిపించాయి. ఆమె ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తని మ్యారేజ్‌ చేసుకోబోతుందన్నారు. రూమర్స్ చాలా వినిపిస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు తమన్నా స్పందించింది. తాను మ్యారేజ్‌ చేసుకోవడానికి ఇంకా రెండేళ్లు టైమ్‌ పడుతుందని తెలిపింది. 

55

`మ్యారేజ్‌కి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. ప్రస్తుతానికి మ్యారేజ్‌ చేసుకునే ఆలోచన లేద`ని వెల్లడించింది. అయితే తమన్నాకి గతంలో మాదిరిగా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. క్రమంగా తగ్గుతున్నాయనే టాక్‌ ఉంది. ఈ రెండేళ్లల్లో సాధ్యమైన సినిమాలు చేసి ఇక మ్యారేజ్‌ చేసుకుని కాజల్‌ మాదిరిగా లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలనుకుంటుందట తమన్నా. మొత్తానికి ఇందులో నిజమెంతో గానీ మిల్కీ బ్యూటీ ప్లాన్‌ అదిరిందంటున్నారు నెటిజన్లు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories