ఏప్రిల్ 8న అఖిల్ అక్కినేని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అల్లు అర్జున్ 40వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇక అఖిల్ తన 28వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నాడు.
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో సమంత యాక్టివ్ గా ఉంటూ తరచుగా పోస్ట్ లు పెడుతోంది. చైతూతో విడిపోయినప్పటికీ సామ్.. అక్కినేని ఫ్యామిలిలో ఇతరులతో.. టాలీవుడ్ స్టార్స్ తో మంచి రిలేషన్ మైంటైన్ చేస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా అందరి నటులకు విషెస్ చెబుతోంది.
26
Samantha
ఏప్రిల్ 8న అఖిల్ అక్కినేని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అల్లు అర్జున్ 40వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇక అఖిల్ తన 28వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నాడు. సమంత వీరిద్దరికి బర్త్ డే విషెస్ తెలిపింది.
36
Samantha
'హ్యాపీ బర్త్ డే అఖిల్.. ఈ ఏడాది నువ్వు కోరుకున్న విధంగా మంచి జరగాలని ప్రార్థిస్తున్నా' అంటూ సమంత పోస్ట్ పెట్టింది. సమంత బర్త్ డే విషెస్ కి అఖిల్ ఏమాత్రం స్పందించలేదు. కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. దీనితో ఇదికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
46
Samantha
మరోవైపు సామ్.. అల్లు అర్జున్ కి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. టెర్రిఫిక్ పర్సన్ అల్లు అర్జున్ కి జన్మదిన శుభాకాంక్షలు. నీ అద్భుతమైన జర్నీలో నేను కూడా చిన్న భాగం అయినందుకు సంతోషంగా ఉంది అంటూ సమంత పోస్ట్ చేసింది. దీనికి 'టచ్ చేశావ్.. థ్యాంక్యూ మై సామ్ అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు.
56
Samantha
అల్లు అర్జున్ సమంత జంటగా సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించారు. గత ఏడాది బన్నీ పాన్ ఇండియా మూవీ పుష్పలో సమంత ఐటెం సాంగ్ తో ఫ్యాన్స్ ని ఊపేసింది. ప్రస్తుతం సమంత త్వరలో పాన్ ఇండియా మూవీ యశోదతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
66
Samantha
అలాగే పౌరాణిక చిత్రం 'శాకుంతలం' లో కూడా సమంత నటిస్తోంది. పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కి సమంత సైన్ చేస్తోంది. గత ఏడాది సమంత, నాగ చైతన్య అభిమానులకి షాక్ ఇస్తూ విడాకులతో విడిపోయారు.