తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. ప్రస్తుతం తమన్నా సీనియర్ హీరోల చిత్రాల్లో సైతం నటిస్తోంది. ఆమె నటించిన ఇద్దరు సీనియర్ హీరోల చిత్రాలు ఏక కాలంలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించిన జైలర్ ఆగష్టు 10న రిలీజ్ అవుతుండగా..మెగాస్టార్ చిరంజీవికి జోడిగా నటించిన భోళా శంకర్ చిత్రం ఆగష్టు 11న వస్తోంది.