టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.
టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు.
26
వెండితెరపై తమన్నా ఎంత గ్లామర్ గా, హాట్ గా కనిపించినా ఎప్పుడూ ఒక స్థాయి దాటి అందాలు ఆరబోయలేదు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని పాత్రలు కూడా చేయలేదు. కమర్షియల్ సినిమాల్లో అవసరం మేరకు అందాలు ఒలకబోస్తూ వచ్చింది.
36
ప్రస్తుతం తమన్నా నటిస్తున్న బిగ్ మూవీ ఎఫ్3. ఎఫ్2 కి సీక్వెల్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఇది. తమన్నా వెంకటేష్ కి హీరోయిన్ గా నటిస్తోంది.
46
Image: Tamannaah Bhatia/Instagram
ఈ చిత్రంలో కూడా తమన్నా గ్లామర్ ఒలకబోసేందుకు రెడీ అవుతోంది. మే 27న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా బోల్డ్ రోల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో నాకు సీనియారిటీ పెరిగింది. చూస్తుండగానే చాలా సినిమాల్లో నటించా. గుర్తింపు దక్కింది. సీనియారిటీ, గుర్తింపు అనేది ఒక బాధ్యత అని తమన్నా పేర్కొంది.
56
కాబట్టి నేను ఎంచుకునే పాత్రల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అన్ని రకాల పాత్రలు చేయకూడదు. ముఖ్యంగా నా స్థాయి దిగజారే రోల్స్ అసలు చేయకూడదు అని తమన్నా తెలిపింది. తమన్నా ఏంటి ఇలాంటి పాత్రలో నటించింది అని అభిమానులు చిరాకు పడకూడదు అని తమన్నా పేర్కొంది.
66
గ్లామర్ షోకి ఒకే కానీ బోల్డ్ రోల్స్ కి తాను దూరం అని తమన్నా చెప్పకనే చెప్పింది. ఎఫ్ 3 తో పాటు తమన్నా మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ చిత్రంలో కూడా నటిస్తోంది.