
తమన్నా.. ఇటీవల రెండు బోల్డ్ వెబ్ మూవీస్ చేసింది. `జీ కర్డా` అనే ఫిల్మ్ లో అందాల ఆరబోత కాదు, రొమాన్స్ సీన్లలో నటించింది. అందులో ప్రియుడితో కలిసి బెడ్ సీన్లు పంచుకుంది. అది మామూలు బెడ్ సీన్లు కాదు, అసలు ఇందులో నటించింది తమన్నేనా? అని నోరెళ్లబెట్టేలా ఆమె ఆయా సీన్లు చేయడం గమనార్హం. దీంతో ఒక్కసారిగా ఈ మిల్కీ బ్యూటీ వైరల్‌గా మారిపోయింది. దారుణమైన ట్రోల్స్ కి గురయ్యింది.
దానికే అభిమానులంతా షాక్‌లో ఉంటే దాన్ని మించి మరోటి చేసింది. `లస్ట్ స్టోరీస్2`లో ఓ స్టోరీలో నటించింది. పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి బెడ్ షేర్ చేసుకునే సీన్లలో నటించింది. రెండు మూడు బెడ్ సీన్లు చేసింది. కార్లలో ముద్దులు రొమాన్స్ వంటి సీన్లు కాస్త జుగుప్సాకరంగా అనిపించాయి. కానీ ఇవే ట్రెండింగ్‌గా మారాయి. యూత్ ఇలాంటి వాటినే బాగా చూస్తుండటం, వారికి బాగా ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఓటీటీ సంస్థుల, ఆర్టిస్టులు రెచ్చిపోతున్నారు.
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో `జైలర్` చిత్రంలో నటిస్తుంది తమన్నా. మొదటిసారి రజినీతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. తమిళంలో తమన్నా చాలా తక్కువగా సినిమాలు చేసింది. తెలుగుకే ప్రయారిటీ ఇచ్చింది. కానీ ఇటీవల ఆమె ట్రెండ్ మార్చి అన్ని లాంగ్వేజ్‌లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ముఖ్యంగా సీనియర్లకి తమన్నా కేరాఫ్‌గా నిలుస్తుంది. తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్`, మలయాళంలో దిలీప్ కుమార్‌తో `బంద్రా` చిత్రాలు చేస్తుంది.
తమిళంలో రజినీతో కలసి నటిస్తున్న `జైలర్` చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ షురూచేశారు. ఇందులో భాగంగా ఓపాటని విడుదల చేశారు. `కావాలా.. `అంటూ సాగే పాట ఇది. ఈ పదం రెండు మూడు రోజులుగా ట్రెండింగ్ అవుతుంది. రజనీకాంత్ సినిమా కావడం, హాట్ సెన్సేషనల్‌గా మారిన తమన్నా ఇందులో డాన్సు చేయడంతో ఈ సాంగ్ బాగా వినిపించింది.
ఇందులో తమన్నా.. రజనీకాంత్‌తో కలిసి స్టెప్పులేసింది. అందాలతో రెచ్చిపోయింది. ఇప్పటి వరకు తమన్నా చాలా ఐటెమ్ సాంగ్స్ చేసింది. అందాలు ఆరబోసింది. కానీ ఇందులో చాలా కొత్తగా కనిపించింది. ఆమె కాస్ట్యూమ్స్, హెయిర్ స్టయిల్ ఇలా అన్నీ కొత్తగా ఉన్నాయి. రెట్టింపు అందంతో, ఐటెమ్ గర్ల్ లా కనిపిస్తుంది. ఈ పాట ఓ మోస్తారుగా ట్రెండ్ అవుతుంది. రజనీ రేంజ్‌లో రీచ్ కాలేదు. సంగీత దర్శకుడు అనిరుథ్ సరైన ట్యూన్ ఇవ్వలేదు, మజాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కానీ ఇందులో తమన్నా మాత్రం అందంతో రెచ్చిపోయింది. బొద్దుగా కనిపిస్తుంది. నాభి అందాలు చూపించింది. థండర్ థైస్ పిచ్చెక్కించేలా ఉంది. ఆమె లుక్ తెగ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఆయా క్లిప్పులు ట్రెండింగ్‌గా మారాయి. నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తమన్నా ఇంత హాట్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.
అయితే తాజాగా దీనిపై ప్రియుడు విజయ్ వర్మ స్పందించారు. కొన్ని రోజులుగా తమన్నా, విజయ్ వర్మ(ఎంసీఏ విలన్) ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కలిసి డేటింగ్ చేస్తున్నారు. తిరుగుతున్నారు. `లస్ట్ స్టోరీస్ 2`లోనూ ఇద్దరూ పెయిర్‌గా నటించి రొమాన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో `జైలర్`లో తమన్నా ఇంత హాట్‌గా కనిపించడంపై విజయ్ వర్మ రియాక్ట్ అయ్యాడు. ఆయన పోస్ట్ మాత్రం అందరిని నోరెళ్ల బెట్టేలా చేస్తుంది.
`కావాలా` పాటలో తమన్నా చాలా అందంగా ఉందట. ఆమె డ్యాన్స్ పై పొగడ్తల వర్షం కురిపించారు. తన ప్రేమని వ్యక్తం చేశాడు. డాన్సు వీడియోకి రియాక్ట్ అవుతూ `ఫైర్` అంటూ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు ఏకంగా.. తమన్నా రజినీకాంత్ లను దేవుళ్లు అంటూ కామెంట్ చేయడం విశేషం. దీంతో ఇది చూసిన నోరెళ్లబెట్టడం నెటిజన్ల వంతయ్యింది.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో వస్తున్న `జైలర్` చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, సునీల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.