క్యూట్ సెల్ఫీలతో అట్రాక్ట్ చేస్తున్న శ్రీలీలా.. ‘ధమాకా’ బ్యూటీ క్రేజ్ మాములుగా లేదుగా..

First Published | Jul 10, 2023, 8:10 PM IST

క్రేజీ హీరోయిన్ శ్రీలీలా టాలీవుడ్ సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది. 
 

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela)  వరస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది.
 

చివరిగా ‘ధమాఖా’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నవిషయం తెలిసిందే. ఇక మరికొద్దిరోజుల్లో పంజా వైష్ణవ్ తేజ్ సరసన నటించిన ‘ఆదికేశవ’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత నుంచి ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో టాలీవుడ్ లో రచ్చ చేయబోతోంది.
 


ముఖ్యంగా శ్రీలీలాకు అతి తక్కువ సమయంలో బాలయ్య, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం విశేషం. ఇప్పుడే ఈ స్థాయిలో శ్రీలీలా ఊపుతుందంటే.. మున్ముందు ఏ స్థాయిలో సంచలనం సృష్టించబోతోందో అర్థం అవుతోంది. 
 

అయితే, చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీలా త్వరలో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం  క్రేజీగా పోస్టులు పెడుతూ వస్తోంది. 
 

తాజాగా క్యూట్ సెల్ఫీలతో శ్రీలీలా నెట్టింట దర్శనమిచ్చింది. ట్రెండీ వేర్ లో మిర్రర్ ముందుకు క్యూట్ గా సెల్ఫీలకు పోజులిస్తూ కట్టిపడేసింది. కుర్ర భామ చిలిపి ఫోజులకు రెస్పాన్స్ దక్కుతోంది. ఫొటోలను పంచుకున్న క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. అర్ధగంటలోనే లక్షకు పైగా లైక్స్  అందాయంటే ఈ బ్యూటీ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 

ఇక ప్రస్తుతం శ్రీలీలా ఎనిమిది చిత్రాల్లో నటిస్తోంది. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఇన్ని సినిమాలు చేస్తుండటం విశేషం. ఉస్తాద్ భగత్ సింగ్’, ‘భగవంత్ కేసరి’, ‘స్కంద’, ‘నితిన్32’, ‘ఆదికేశవ’, ‘గుంటూరుకారం’, ‘వీడీ12’, ‘జూనియర్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. 

Latest Videos

click me!