Tamannaah Bhatia : మరోసారి తమన్నా స్పెషల్ సాంగ్? టాలీవుడ్ లోనా.. బాలీవుడ్ లోనా!

Published : Dec 09, 2023, 07:25 AM IST

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) మరోసారి స్పెషల్ సాంగ్ తో దుమ్ములేపబోతోంది. ఇంతకీ ఎవరి సినిమా? టాలీవుడ్ లోనా? బాలీవుడ్ లోనా? అనే విషయాలు తెలుసుకుందాం.

PREV
16
Tamannaah Bhatia : మరోసారి తమన్నా స్పెషల్ సాంగ్? టాలీవుడ్ లోనా.. బాలీవుడ్ లోనా!

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్నేళ్లపాటు తెలుగులో బడా హీరోల సరసన నటించి మెప్పించింది. వెండితెరపై విభిన్న పాత్రలు, గ్లామర్ మెరుపులు, తన విలక్షణ నటనతో అలరించింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది.

26

ప్రస్తుతం కెరీర్ లో తమన్నా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ మతులు పోగొడుతోంది. దాదాపుగా ఇరవై ఏళ్లుగా తను పెట్టుకున్న రూల్స్ ను బ్రేక్ చేస్తూ సినిమాలు చేస్తోంది. అందుకు ఉదాహరణ ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘జీ కర్దా’ అని చెప్పొచ్చు. 

36

మరోవైపు తమన్నా లేడీ ఓరియెంటెడ్  చిత్రాలతో అలరిస్తూనే.. ఇటు బడా హీరోలతో వెండితెరపై మెరుస్తూనే వస్తోంది. మరీ ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ తో దుమ్ములేపుతోంది. ఐటెం సాంగ్స్ తోనే మిల్క్ బ్యూటీ సెన్సేషన్ గా మారుతోంది. ఏదో ఒకటి, రెండు చేసి వదిలేయడం లేదు.. వరుస పెట్టి చేస్తోంది.

46

రీసెంట్ గా ‘జైలర్’.. ‘కావాలయ్యా’ సాంగ్ తో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అంతకు ముందుకు... అల్లుడు శ్రీను, స్పీడున్నోడు, సరిలేరు నీకెవ్వరు’, గని.. వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రాబోతున్న ఓ సంచలనాత్మకమైన హార్రర్ ఫిల్మ్ స్త్రీ2 (Stree 2)లో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

56

2018లో 14 కోట్ల బడ్జెట్ తో వచ్చి రూ.180 కోట్లు కలెక్ట్ చేసిందీ చిత్రం. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ద్వయం దర్శకత్వం రాజ్ అండ్ డీకే స్క్రీన్ ప్లే అందించడం విశేషం. హార్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం సెన్సేషన్ గా మారడంతో ప్రస్తుతం సీక్వెల్ Stree 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 

66

2024లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తమన్నా స్పెషల్ అపియరెన్స్ తో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేయబోతుందంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చివరిగా తమన్నా ‘భోళా శంకర్’తో అలరించింది. ప్రస్తుతం ‘వేడా’, ‘అరనమణై 4’ చిత్రాల్లో నటిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories