లింగ వివక్ష, అగౌరవం, సందీప్‌ రెడ్డి వంగాపై దీపికా పదుకొణె సంచలన పోస్ట్.. తమన్నా మద్దతు

Published : May 28, 2025, 11:25 PM IST

`స్పిరిట్` సినిమా నుండి దీపికా పదుకొణే తప్పుకుంది. ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు.  ఈ సందర్భంగా  దీపికాకి తమన్నా సపోర్ట్ చేసింది.

PREV
16
మహిళలపై వివక్ష.. దీపికా పదుకొనె పోస్ట్

`స్పిరిట్` సినిమా నుండి దీపికా పదుకొణే తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో మహిళలపై వివక్ష గురించి వీడియో షేర్ చేశారు.
 

26
దీపికా పదుకొణేకి తమన్నా సపోర్ట్

దీపిక పోస్ట్ చేసిన వీడియోను తమన్నా భాటియా లైక్ చేసి మద్దతు తెలిపారు. ఈ వీడియో 2020లో 'ఛపాక్' సినిమా ప్రెస్ మీట్ ది కావడం విశేషం.

36
లింగ వివక్ష, పారితోషికంలో తేడాలు

దీపిక ఈ వీడియో షేర్ చేస్తూ  'అగౌరవం, పురుషులు, లింగ వివక్ష, పారితోషికంలో తేడాలు, ఓవర్ టైం వర్క్, ప్రొఫెషనల్ కాని ప్రవర్తన, మహిళలపై ద్వేషం, డబుల్ స్టాండర్డ్స్' అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను తమన్నా లైక్ చేసి మద్దతు తెలపడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది.

46
`స్పిరిట్‌`కి దీపికా నో చెప్పడానికి కారణం

`స్పిరిట్` సినిమా కోసం రోజుకు ఆరు గంటల కంటే ఎక్కువ షూటింగ్ చేయనని దీపిక స్పష్టం చేసిందట. ఈ విషయంలోనే దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకి మండిందని, అందుకే దీపికాని తప్పించినట్టు సమాచారం. 

56
దీపికా పదుకొనె కండీషన్స్

షూటింగ్ 100 రోజులకు మించితే, అదనపు రోజులకు అదనపు పారితోషికం ఇవ్వాలని  దీపిక డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షరతులు సందీప్ రెడ్డి వంగాకు ఇబ్బంది కలిగించాయని తెలుస్తుంది.

66
ప్రభాస్‌కి జోడీగా త్రిప్తి డిమ్రీ

 `స్పిరిట్` సినిమాలో దీపిక స్థానంలో  త్రిప్తి డిమ్రీని ఎంచుకున్నారు దర్శకుడు. వీళ్లిద్దరూ ఇంతకు ముందు 'అనిమల్' సినిమాలో కలిసి పనిచేశారు. దీంతో ఈ మూవీపై స్పెషల్‌ బజ్‌స్టార్ట్ అయ్యింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories