తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia). తన అందం, టాలెంట్ తో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం సౌత్, నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
గతేడాది తెలుగు, హిందీలో ఏకంగా ఐదు చిత్రాలతో అలరించారు తమన్నా భాటియా. ఈ ఏడాది కూడా అదే జోరు చూపిస్తోంది. ప్రస్తుతం ఆయా భాషల్లో మిల్క్ బ్యూటీ నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తను నటిస్తున్న రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పై లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్ లోని అజా ఫ్యాషన్ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన తమన్నా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ‘జైలర్’,‘భోళా శంకర్’,‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలపై ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. రజినీకాంత్, చిరంజీవి సరసన నటిస్తుండటం పట్ల తన ఫీలింగ్ ను షేర్ చేసుకున్నారు.
తమన్నా మాట్లాడుతూ.. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటిస్తుండటం చాలా హ్యాపీ ఉందన్నారు. ఏ హీరోయిన్ కైనా రజినీసార్ తో కలిసి పనిచేయడం డ్రీమ్ గా ఉంటుందన్నారు. తనూ కొన్నేండ్లుగా అదే డ్రీమ్ లో ఉన్నారన్నారు. ఇన్నాళ్లకు అది నిజమైనందుకు హ్యాపీగా ఉందని తెలిపారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి సరసన ఇప్పటికే ‘సైరా నర్సింహారెడ్డి’లో నటించారన్నారు. మరోసారి ‘భోళా శంకర్’తో చిరు సరసన నటించే అవకాశం రావడం మరింత ఉత్సాహాంగా ఉందన్నారు. ఇక ఆస్కార్ బరిలో నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’పైనా స్పందిస్తూ.. రాజమౌళి అందరినీ గర్వించేలా చేశారని ధన్యవాదాలు తెలిపారు.
మిల్క్ బ్యూటీ తమన్నా ఇటు సౌత్, అటు నార్త్ సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాలు ‘జైలర్’, ‘బోల్ చుడియా’, ‘భోళా శంకర్’, మలయాళంలో ‘బాంద్రా’లో నటిస్తున్నారు. ఇదీగాకా మరో వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి చేతినిండా సినిమాలతో తమన్నా బిజీ అయిపోయారు.