చాలా మంది చేసే తప్పులో ఒకటి గతాన్ని తవ్వుకోవడం. ఎప్పుడో ఏదో జరిగినదాన్ని పట్టుకుిన వేలాడటం నాకు ఇష్టం ఉండదు. సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. వాటినే తలుచుకుంటూ కుంగిపోవడమో, పొంగిపోవడమో తెలివైన పని కాదు. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం రాబోయే సినిమాల మీదే. ప్రతి స్క్రిప్ట్ జాగ్రత్తగా చదువుతాను. నిర్ణయం తీసుకున్నాక మాత్రం గెనకడుగు వేయనంటోంది రకుల్ ప్రీత్ సింగ్.