అంతా అబద్దమా.. డైమండ్ రింగ్ సీక్రేట్ విప్పిన తమన్నా.. ఉంగరం ఉపాసన ఇచ్చినదేనా...?

Published : Jul 26, 2023, 11:51 AM IST

హీరోయిన్ తమన్నాకు మెగా కోడలు ఉపాసన డైమండ్ రింగ్ ఇచ్చిందా..? సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం ఎంత..? ఈ విషయంలో తమన్న ఏమంటుంది..?   

PREV
16
అంతా అబద్దమా.. డైమండ్ రింగ్ సీక్రేట్ విప్పిన తమన్నా.. ఉంగరం ఉపాసన ఇచ్చినదేనా...?
Tamannaah Bhatia

ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో డైమండ్ రింగ్ టాపిక్  ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. మెగా కోడలు ఉపాసన.. టాలీవుడ్ హీరోయిన్  తమన్నాకి  డైమండ్ రింగ్ ఇచ్చిందంటూ.. వార్తలు షికార్లు చేశాయి. ఈ విషయంలో చాలా రోజులుగా కన్ ఫ్యూజన్ నెలకొని ఉంది. ఈ విషయంలో తాజాగా క్లారిటీ ఇచ్చింది మిల్క్ బ్యూటీ. 

26
Tamannaah Bhatia

ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత మంది  హీరోయిన్లు ఉన్నప్పటికీ ఉపాసన ఆ డైమండ్ రింగ్  తమన్నాకే ఎందుకు ఇచ్చింది. అది కూడా  రెండు కోట్ల విలువ చేసే డైమండ్ రింగ్ ఆమెకు ఎందుకు ఇచ్చి ఉంటుంది అని పలు అనుమానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అసలు ఈ విషయంలో నిజం ఎంత అని అంతా ఆరా తీయ్యడం మొదలుపెట్టారు. 
 

36

అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరాలో తమన్నా  హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం చిరుతో భోళా శంకర్ లో కూడా నటిస్తోంది. అయితే సైరాలో తన మామయ్యతో కలిసి తమన్నా అద్భుతంగా నటించిందని..ఆ పాత్రకి ఆకర్షితురాలైన ఉపాసన  ఆమెకి ఇప్పటికే గుర్తిండి పోయేలా ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుందని.. వార్తలు హల్ చల్ చేశాయి. 

46

అంతే కాదు ప్రపంచంలోనే ఖరీదైన ఐదవ వజ్రం ఉన్న డైమండ్ రింగ్ ని తమన్నాకు ఉపాసన బహుమతిగా ఇచ్చింది అని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా తమన్నా ఆ రింగ్ పెట్టుకున్న ఫొటోస్ కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి. మరి ఈ విషయంలో నిజం ఎంత..? 

56

డైమండ్ రింగ్  వార్తలన్నింటి పై మిల్క్ బ్యూటీ  తాజాగా క్లారిటీ ఇచ్చింది. తనకు  ఉపాసన   రెండు కోట్ల విలువ చేసే డైమండ్ రింగ్ ఇచ్చిందన్న వార్తలు హైలెట్ అవుతున్న నేపథ్యంలో.. మాట్లాడిన బ్యూటీ.. అసలు  నాకు ఎవరు కూడా ఎలాంటి విలువైన డైమండ్ రింగ్ ఇవ్వలేదు.నేను నా వేలికి పెట్టుకుంది డైమండ్ రింగ్ కాదు.. అది సోడా బాటిల్ ఓపెనర్. అంటూ అసలు విషయం బయట పెట్టింది తమన్నా. 

66
tamannaah

అయితే నా వేలికి పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుందని ఫోటోలకి కొన్ని ఫోజులిచ్చాను.అంతేగానీ నాకు ఎవరు ఎలాంటి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇవ్వలేదు.. అని అసలు విషయాన్ని బయట పెట్టింది.అయితే తమన్నా డైమండ్ రింగ్  పై క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం తెలిసిన నెటిజన్స్ అందరూ నవ్వుకుంటున్నారు.
 

click me!

Recommended Stories