నువ్వు కరణ్ బాలీవుడ్ ను చెడగొడుతున్నారు... ఏక్తా కపూర్ పై ట్రోల్స్, కౌంటర్ ఇచ్చిన బ్యూటీ..

ఏక్తా కపూర్ ను ధారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. బాలీవుడ్ లోచాలా మందిని చెడగొడుతున్నావంటూ ఆమెపై మండిపడుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసింది. 

Bollywood Producer Ekta Kapoor Counter attack To Netizen JMS
Image: Varinder Chawla

బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సాధించింది ఏక్తా కపూర్. సినిమాలు.. కాంట్రవర్సీలు రెండింటిని బ్యాలన్స్ చేసుకుంటూ.. ట్రోలర్స్ ను ఫేస్ చేస్తూ.. కౌంటర్లు ఇస్తూ.. తాను స్పెషల్ అనిపించుకుంటుంది. అంతే కాదు అడల్ట్ సినిమాలు చేయడంలో ఏక్తా కపూర్ మార్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది. 

హాట్ హాట్ సినిమాల విషయంలోనే ఆమె ఎక్కువగా విమర్షలు ఎదుర్కొంటూ ఉంటుంది. ముఖ్యంగా అడల్ట్ సినిమాల విషయంలో ఆమెపై డైరెక్ట్ గానే మండిపడుతున్నారు నెటిజన్లు.. నీ వల్ల ఎంతోమంది చెడిపోతున్నారు, మంచి సినిమాలు చేయడం తెలుసుకో అంటూ వ్యాఖ్యానించిన నెటిజన్‌కు నిర్మాత ఏక్తాకపూర్ నా ఇష్టమున్న సినిమాలు తీస్తానంటూ తన మార్క్ సమాధానం చెప్పింది. 
 


Image: Varinder Chawla

రీసెంట్ గా ఏక్తా కపూర్ నిర్మించిన సినిమా థ్యాంక్యూ ఫర్ కమింగ్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో  ఏక్తా కపూర్ డైరెక్ట్ గానే విమర్షలు ఫేస్ చేస్తూ వస్తోంది.  భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిలా ప్రధాన పాత్రల్లో నటించిన థ్యాంక్యూ ఫర్ కమింగ్ సినిమా అక్టోబర్ 6న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆస్క్ మి ఎనీథింగ్ అంటూ.. సోషల్ మీడియా వేదికగా చిట్ నిర్వహించింది. 
 

Image: Our Own

ఈ క్రమంలో నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు, కరణ్ జోహార్ కలిసి చాలామందిని చెడగొడుతున్నారని, చాలామంది విడాకులకు మీరిద్దరే కారణమని పేర్కొన్నారు. దీనిపై ఏక్తాకపూర్ స్పందిస్తూ... అవునా అని ఒక్కమాటతో వదిలేశారు. 
 

ఆ తర్వాత మరో నెటిజన్ దయచేసి మీరు అడల్ట్ సినిమాలు చేయడం మానండి అని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ... నో, నేనొక అడల్ట్, కాబట్టి అడల్ట్ సినిమాలే చేస్తానని చాలా ఘాటుగా సమాధానం చెప్పింది ఏక్తా కపూర్. ఆమె చేసిన చిట్ చాట్ లో ఆమెపై విమర్షలు కురిపించినవారే ఎక్కువగా ఉన్నారు. అయినా సరే.. తాను తనకు నచ్చిన విధంగానే ఉంటాను అంటోంది ఏక్తా కపూర్. 
 

Latest Videos

vuukle one pixel image
click me!