టబు సింగిల్ లైఫ్ కి కారణం ఆ హీరోనే...బర్త్ డే సందర్భంగా ఆమె గురించి మీకు తెలియని నిజాలు

First Published Nov 4, 2020, 1:11 PM IST


బాలీవుడ్ దివా ఎవర్ గ్రీన్ బ్యూటీ టబు నేడు తన 50వ జన్మదినం జరుపుకుంటున్నారు. అర్థ సెంచరీ దాటినా వన్నె తరగని అందం, అద్భుత నటనా సామర్ధ్యంతో దూసుకుపోతుంది ఈ అమ్మడు. బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలో కూడా ఇమేజ్ ఉన్న టబు బర్త్ డే సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం 

టాలీవుడ్ హీరోలలో కింగ్ నాగార్జునకు టబు మంచి స్నేహితురాలు. నిన్నే పెళ్లాడతా వంటి హిట్ మూవీలో నటించి వీరిద్దరూ, టబు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కలుసుకుంటారు.
undefined
టబు అసలు పేరు తబసం ఫాతిమా హష్మీ. టబు తల్లిదండ్రులుజమాల్ అలీ హష్మీ మరియు రిజ్వానా కాగా, హైదరాబాద్ లో జన్మించింది. టబు బాల్యంలోనే తల్లిదండ్రులు విడిపోయారు.
undefined
టబు అక్క ఫరా నాజ్ కాగా వీరిద్దరూ ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీకి మేనకోడళ్లు అవుతారు.
undefined
1982లో వచ్చిన బజార్ అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా టబు వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక 1991లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ కూలీ నంబర్ వన్ హీరోయిన్ గా టబుకు మొదటి చిత్రం.
undefined
సంజయ్ కపూర్ హీరోగా తెరకెక్కిన ప్రేమ్ టబు మొదటి బాలీవుడ్ చిత్రం. అనేక కారణాలతో 8ఏళ్ళు ప్రొడక్షన్ జరుపుకున్న ఈ చిత్రం చివరికి ప్లాప్ గా మిగిలింది. ఐతే టబు కెరీర్ మాత్రం సక్సెస్ ఫుల్ గానే సాగింది.
undefined
1994లో విజయ్ పథ్ సినిమాకు గాను ఉత్తమ వర్ధమానహీరోయిన్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది టబు . ఈ సినిమాలోహీరోగా అజయ్ దేవ్ గణ్ నటించారు.
undefined
అత్యధికంగా బాలీవుడ్ చిత్రాలలో నటించిన టబు, తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ మరియు బెంగాలీ చిత్రాలలో నటించారు. హాలీవుడ్ లో కూడా టబు కొన్ని చిత్రాలు చేశారు.
undefined
టాలెంటెడ్ హీరోయిన్ గా పేరున్న టబు ఉత్తమ నటిగా రెండు నేషనల్ అవార్డు, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుపొందడం జరిగింది.
undefined
2011లో చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్యం పద్మశ్రీతో సత్కరించడం జరిగింది.
undefined
ఇక వైవాహిక జీవితం వద్దనుకున్న టబు, తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం హీరో అజయ్ దేవ్ గణ్ అని చెప్పడం విశేషం.
undefined
click me!