చిత్ర హింసలు పెట్టి చివరికి బిగ్ బాస్ హ్యాండిచ్చాడు...ఐదుగురు సభ్యుల ఆశ అడియాసలు అయ్యాయి..!

First Published Nov 3, 2020, 11:21 PM IST


ఇంటి సభ్యులలో అత్యధికులు  తలపై గుడ్లు పగులగొట్టిన నేపథ్యంలోమోనాల్, అవినాష్, అభిజిత్, అమ్మ రాజశేఖర్ మరియు హారిక నామినేట్ అయ్యారు. అమ్మ రాజశేఖర్, అవినాష్ లపై అత్యధిక సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. నామినేషన్స్ ప్రక్రియలో అభిజిత్, అమ్మ రాజశేఖర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చిల్లర కామెడీ అన్న నోయల్ మాటలను సమర్ధించి ఇద్దరు టెక్నిషియన్స్  కడుపుపై కొట్టారని అమ్మ రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుటివాళ్లను అనే మీరు మిమ్ముల్ని ఎవరైనా అంటే తట్టుకోలేరని కారణం చెప్పి అభిజిత్, రాజశేఖర్ ని నామినేట్ చేశాడు. వాడివేడిగా సాగిన గొడవ ఇంటి సభ్యుల చొరవతో ఆగిపోయింది. 

ఇంటి సభ్యులలో అత్యధిక మంది నామినేట్ చేసిన సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. మోనాల్, అవినాష్, అభిజిత్, అమ్మ రాజశేఖర్ మరియు హారిక నామినేట్ అయ్యారు. నామినేటైన ఇంటి సబ్యులకు బిగ్ బాస్ ఓ అవకాశం ఇచ్చాడు.
undefined
ఓ టాస్క్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయడం ద్వారా ఎలిమినేషన్ నుండి తప్పించుకోవచ్చని చెప్పడం జరిగింది. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన టేబుల్స్ పై నామినేటైన సభ్యులు తమ ముఖం ఉంచాలని, ఇంటి సభ్యులు వారిని ఇరిటేట్ చేస్తూ ముఖాన్ని అక్కడ నుండి తీసేలా చేయాలని. ఎవరైనా రెండు కంటే ఎక్కువ సార్లు తమ తల టేబుల్ నుండి తీసివేస్తారో వారు ఎలిమినేషన్ లో ఉంటారని, బిగ్ బాస్ ఆదేశించే వరకు తల అక్కడ ఉంచినవారు...ఇమ్యూనిటీ పొంది ఎలిమినేషన్ నుండి కాపాడపడతారని చెప్పాడు.
undefined
ఈ టాస్క్ లో ఐదుగురు సభ్యుల ముఖాలపై ఇంటి సభ్యులుఐస్, వాటర్, డస్ట్ , గ్రాస్ వంటివి వేసి విసిగించారు. ఈ టాస్క్ లో మోనాల్ముఖం కడిగిన అఖిల్ మరియు సోహైల్ మధ్య గొడవ నడిచింది. అఖిల్ తన టార్గెట్ మొత్తం అమ్మ రాజశేఖర్ పై ఉంచాడు. అతన్ని వీలైనంతగా విసిగించేప్రయత్నం చేశాడు.
undefined
undefined
మొత్తంగా ఈ టాస్క్ నామినేటైనసభ్యులకుచుక్కలు చూపించింది. ఇంత కష్టపడి కూడా ఒక్కరు కూడా ప్రయోజనం పొందలేదు. బజర్ మోగే సమయానికి ఒక్కరికంటే ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలోఎవరికీఎలిమినేషన్ నుండి మినహాయింపు లభించదనిబిగ్ బాస్చెప్పారు. అభిజిత్స్వచ్ఛందంగా తప్పుకోగా, హారికరెండు సార్లుతలను అక్కడ నుండి తీసి డిస్ క్వాలిఫై అయ్యింది.
undefined
బజర్ మోగేనాటికిమోనాల్, అవినాష్, అమ్మరాజశేఖర్మిగలడంతో ఎవరికీ ఎలిమినేషన్ నుండి ఉపశమనం లభించలేదు. నామినేటైన ఐదుగురూఎలిమినేషన్ లో ఉండాల్సి వచ్చింది.
undefined
click me!