తెలుగు అమ్మాయి లయ వెండితెరపై తన మార్కు వేశారు. సూపర్ హిట్ చిత్రాలతో సత్తా చాటారు. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పిన లయ చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు.
విజయవాడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన లయ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. 1992లో విడుదలైన భద్రం కొడుకో మూవీలో లయ లీడ్ రోల్ చేశారు. ఆ మూవీ స్ట్రీట్ చైల్డ్స్ పై తీసిన చిత్రం.
28
Laya
హీరోయిన్ గా లయ మొదటి చిత్రం స్వయంవరం. హీరో వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన స్వయం వరం మంచి విజయాన్ని సాధించించింది. ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది.
38
Laya
తెలుగులో లయకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ముఖ్యంగా టైర్ టూ హీరోల ఛాయిస్ గా మారారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న లయకు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కాయి. ప్రేమించు ఈ తరహా చిత్రమే. ప్రేమించు మూవీలో లయదే ప్రధాన పాత్ర. సాయి కిరణ్ హీరో.
48
Laya
సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ప్రేమించు హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేమించు లో లయ అంధురాలు పాత్ర చేశారు. హనుమాన్ జంక్షన్, నువ్వులేక నేనులేను వంటి కమర్షియల్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉంది కొద్ది రోజులే అయినా 50 కి పైగా చిత్రాల్లో లయ నటించారు.
58
Laya
విజయేంద్రవర్మ మూవీలో లయ బాలకృష్ణకు జంటగా నటించారు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. 2006 వరకు లయ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగింది. చిన్నదో పెద్దదో ఆఫర్స్ మాత్రం ఆగలేదు.
68
Laya
2006లో కాలిఫోర్నియా లో డాక్టర్ గా సెటిల్ అయిన గణేష్ గొర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయనతో పాటు కాలిఫోర్నియా వెళ్లిపోయారు. హౌస్ వైఫ్ గా ఉంటున్న లయ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అమ్మాయి పేరు శ్లోక కాగా అబ్బాయి పేరు వచన్.
78
Laya
2010లో విడుదలైన బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం మూవీలో లయ నటించారు. 2018లో శ్రీను వైట్ల-రవితేజ కాంబోలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో లయ నటించారు.
88
Laya
చాలా కాలం తర్వాత లయ సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు. ఆమె కాలిఫోర్నియాలో జరుగుతున్న ఒక ఎలక్షన్ లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. పోలింగ్ కేంద్రంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. లయను చూసిన నెటిజెన్స్ తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు. ఇన్నేళ్లలో అసలు ఏం మారలేదు అంటున్నారు. లయ అందం అలాగే చెక్కు చెదరకుండా ఉందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు.