నా దగ్గర పులిహోర కలపొద్దు.. హైపర్ ఆది గాలి తీస్తూ వార్నింగ్ ఇచ్చిన కొత్త యాంకర్

Published : Nov 12, 2022, 01:27 PM IST

తాజాగా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ చేశారు. నవంబర్ 17న ప్రసారం అయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. హైపర్ ఆది ఎప్పటిలాగే సెటైర్లు వేస్తూ కొత్త యాంకర్ ని కెలికే ప్రయత్నం చేశాడు.

PREV
16
నా దగ్గర పులిహోర కలపొద్దు.. హైపర్ ఆది గాలి తీస్తూ వార్నింగ్ ఇచ్చిన కొత్త యాంకర్

జబర్దస్త్ వరుసగా ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఆ మధ్యన యాంకర్ అనసూయ జబర్దస్త్ కి దూరమైంది.  ఇప్పుడు అనసూయ బాటలోనే యాంకర్ రష్మీ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. అయితే రష్మీ మళ్ళీ ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియదు. దీనితో జబర్దస్త్ కోసం సౌమ్య అనే కొత్త యాంకర్ ని తీసుకువచ్చారు. రాగానే సౌమ్య అందరి దృష్టిని ఆకర్శించే విధంగా హంగామా చేస్తోంది. 

26

తాజాగా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ చేశారు. నవంబర్ 17న ప్రసారం అయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. హైపర్ ఆది ఎప్పటిలాగే సెటైర్లు వేస్తూ కొత్త యాంకర్ ని కెలికే ప్రయత్నం చేశాడు. హైపర్ ఆది పంచ్ లకు రష్మీ గతంలో బాగా బుక్కయ్యేది. యాంకర్ సౌమ్య మాత్రం హైపర్ ఆది గాలి తీసేసింది. తనని కెలికే ప్రయత్నం చేసిన హైపర్ ఆడికి సౌమ్య దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. 

36

ప్రోమోలో యాంకర్ సౌమ్య బుట్ట బొమ్మ సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది. హైపర్ ఆది ఆమె వద్దకి వెళ్లి నువ్వు ఒక్కదానివే డ్యాన్స్ చేస్తే ఒట్టి బొమ్మ అవుతుంది.. నాతో కలిసి చేస్తే బుట్ట బొమ్మ అవుతుంది అని తెలిపాడు. దీనికి యాంకర్ సౌమ్య సమాధానం ఇస్తూ.. మీరు ఎంత పులిహోర కలిపినా నేను మీకు పడను అని చెబుతుంది. అయితే ఛాలెంజ్.. నేను చిరంజీవి ఫ్యాన్ ని తెలుసా అని ఆది అంటాడు.. దీనికి సౌమ్య చిరంజీవివి కాదుగా అంటూ గాలి తీస్తుంది. 

46

ఇక సౌమ్యపై జడ్జిగా వ్యవహరిస్తున్న కృష్ణ భగవాన్ కూడా ఫన్నీ సెటైర్లు పేల్చాడు. ఇంద్రజపై కూడా కృష్ణ భగవాన్ కామెడీ పంచ్ లు వేశాడు. జబర్దస్త్ మొత్తం హైపర్ ఆది హవానే సాగుతోంది. నూకరాజు పక్షిరాజా గెటప్ లో కనిపించి అలరించాడు. 

56

జబర్దస్త్ కి కొత్త యాంకర్ రావడంతో నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సౌమ్య రావు కర్ణాటకకి చెందిన మోడల్. టివి సీరియల్స్ లో కూడా నటించింది. మొదట కర్ణాటకలో యాంకర్ గా పనిచేసింది. 

66

అనసూయ, రష్మీ తరహాలోనే సౌమ్య కూడా గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. అయితే వాళ్ళిద్దరి తరహాలోనే జబర్దస్త్ ఈమె కూడా పాపులర్ అవుతుందా అనే  ప్రశ్న తలెత్తుతోంది. తనదైన శైలిలో కామెడీ పంచ్ లు వేస్తూ జబర్దస్త్ లో అటెన్షన్ పొందుతోంది. 

click me!

Recommended Stories