Brahmamudi: భర్తకు ఊహించని షాకిచ్చిన స్వప్న.. కళ్యాణ్ నుండి నిజం తెలుసుకున్న రాజ్?

Published : Jul 29, 2023, 08:55 AM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలను ఏం గెలుచుకొని టాప్ టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. భర్త కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Brahmamudi: భర్తకు ఊహించని షాకిచ్చిన స్వప్న.. కళ్యాణ్ నుండి నిజం తెలుసుకున్న రాజ్?

 ఎపిసోడ్ ప్రారంభంలో  అప్పు, కళ్యాణ్ జాగింగ్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఒక బస్తీ అబ్బాయి కనిపించి మీ అక్క యాడ్లో సూపర్ గా ఉంది బస్తీ అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు అంటాడు. అతని మీద కోపంతో రెచ్చిపోతుంది అప్పు. అతని వెళ్ళిపోయిన తర్వాత మీ అక్క తప్పు చేయడం లేదని అనుకుంటున్నావా అని అడుగుతాడు కళ్యాణ్. తప్పు మా అక్క మాత్రమే చేసిందా మీ ఇంట్లో వాళ్ళు చేయలేదా.
 

28

 ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం మంచినీళ్లు ఇవ్వాలని జ్ఞానం కూడా మీ వాళ్లకు లేదు అంటూ కళ్యాణ్ మీద ఫైర్ అవుతుంది అప్పు. సీను కట్ చేస్తే రుద్రాణి వాళ్ళందరూ  భోజనాలు దగ్గర కూర్చుంటారు. స్వప్న యాడ్ గురించి రుద్రాణి అపర్ణ కి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. ఇంతలో రాజ్ వచ్చి ఈ టాపిక్ ఇక్కడితో వదిలేస్తే మంచిది. నేను కంపెనీ వాళ్ళకి  30 లక్షలు ఇచ్చి ఈ యాడ్ ఇంక రాకుండా మేనేజ్ చేశాను అంటాడు. ఈ మాటలు విన్న స్వప్న కోపంతో రెచ్చిపోతుంది.
 

38

నీకేం హక్కు ఉందని అలా చేశావు అంటూ రాజ్ ని నిలదీస్తుంది. రాజ్ ని  అలా అనేసరికి కావ్యకి కోపం వస్తుంది. స్వప్న మీద ఆడ పులి లాగా రెచ్చిపోతుంది. నువ్వు చేసిన తప్పుని ఆయన సరి చేస్తే ఆయనకి విలువ ఇవ్వకుండా మాట్లాడుతున్నావు అంటూ స్వప్న చేత భర్తకి సారీ చెప్పిస్తుంది. తర్వాత భర్తకి టిఫిన్ తేవటం కోసం వంటగదిలోకి వెళుతుంది. ఈ అమ్మాయికి ఇంత కోపం ఉందా అంటుంది అపర్ణ. భూదేవి అంతే శాంతంగా ఉన్నంతసేపు ఉంటుంది కోపం వచ్చిందంటే ఇలాగే తన ప్రతాపం చూపిస్తుంది అంటుంది చిట్టి.
 

48

సీన్ కట్ చేస్తే కోపంతో రగిలిపోతూ ఉంటుంది స్వప్న. అది చూసిన రుద్రాణి, రాహుల్ ఆనందపడతారు. అది రాజ్, కావ్యల మీద కోపంతో రగిలిపోతుంది. నువ్వు ఆ మంటని ఇంకొంచెం పెంచు. ఆవేశంలో అది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు మనం ఏమి చేయక్కర్లేదు ఇంట్లో వాళ్లే దానికి సంగతి చూసుకుంటారు అని కొడుకుని రెచ్చగొట్టి పంపిస్తుంది రుద్రాణి. భార్య దగ్గరికి వెళ్లి రాజ్ఇలా చేస్తాడు అనుకోలేదు అంటూ సారీ చెప్తాడు రాహుల్.
 

58

దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు. ఉండు నా కోసం ఆలోచించి ఆలోచించి తలనొప్పి వచ్చి ఉంటుంది కాఫీ తీసుకొస్తాను అని కిచెన్ లోకి వెళ్తుంది స్వప్న. దీని మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు అనుకుంటాడు రాహుల్. స్వప్న ప్లేట్లో తీసుకు వచ్చిన దాన్ని చూసి షాక్ అవుతాడు. ఏంటిది అని కోపంగా స్వప్న మీద చెయ్యెత్తుతాడు. కానీ ఆవేశంతో దీనిని దారిలోకి తెచ్చుకోలేము అని మనసులో అనుకుంటాడు.

68

 గాజులు నీకోసమే తెచ్చాను వేసుకో. ఈ ఇంట్లో నీకున్న విలువ అంతే అందుకే రాజ్ నా గురించిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటుంది స్వప్న. వాడికి ఆ సలహా ఇచ్చింది మీ చెల్లిలే నీ మట్టి బుర్రకి అర్థం కావడం లేదు. కావ్య నాకు రాజ్ కి నీకు నాకు మధ్య గోడలు కట్టేస్తుంది ఆ సంగతి చూడు అని రెచ్చగొడతాడు రాహుల్. నా దారికి ఎవరు అడ్డు వచ్చినా ఊరుకునేది లేదు వాళ్ళు అంత చూస్తాను అని ఆవేశంతో రెచ్చిపోతుంది స్వప్న. సీన్ కట్ చేస్తే యాడ్ తీసివేసినందుకు భర్తకి థాంక్స్ చెప్తుంది కావ్య.
 

78

 నేను నా కుటుంబం కోసం చేశాను నీకోసమేమీ కాదు అంటాడు రాజ్. అయితే నాకు థాంక్స్ నాకు ఇచ్చేయండి అంటుంది కావ్య. అదేమైనా వస్తువ ఇచ్చేయటానికి ఇంకేమైనా కావాలంటే అడుగు ఇస్తాను అంటాడు  రాజ్. అయితే ముద్దు ఇవ్వండి అంటుంది కావ్య. షాక్ అవుతాడు రాజ్ అది కూడా ఇవ్వడం జరగదు అని చెప్తాడు. ముద్దు ఇవ్వడు,థాంక్స్ ఇవ్వడు పిసినారి మొగుడు అని భర్తని వెక్కిరిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య.
 

88

మరోవైపు ఉన్న పళంగా డబ్బు కట్టమంటూ సేటు పెద్ద మనుషులని తీసుకొని కృష్ణమూర్తి ఇంటికి వస్తారు. పెద్ద మనుషులు అప్పు మొత్తం ఆరు నెలల్లో కట్టమని, 50000 వడ్డీ మాత్రం రెండు రోజుల్లో కట్టమని తీర్పు ఇస్తారు. తరువాయి భాగంలో అప్పుడు విషయం అంతా కావ్యకి చెప్తాడు కళ్యాణ్. ఆ మాటలు రాజ్ వింటాడు. భార్య గదిలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అడుగుతాడు కానీ స్వప్న ఏమీ లేదు అంటూ మాట దాటి వేస్తుంది. కానీ రాజ్ కళ్యాణ్ ద్వారా జరిగిందంతా తెలుసుకుంటాడు.

click me!

Recommended Stories