Brahmamudi: రాహుల్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న స్వప్న.. కళ్యాణ్ ని అలెర్ట్ చేసిన అప్పు!

Published : May 08, 2023, 12:55 PM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తప్పులేదని నిరూపించుకొని తన జీవితంతో పాటు అక్క జీవితాన్ని కూడా నిలబెట్టాలి అనుకుంటున్న ఒక చెల్లెలు కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Brahmamudi: రాహుల్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న స్వప్న.. కళ్యాణ్ ని అలెర్ట్ చేసిన అప్పు!

ఎపిసోడ్ ప్రారంభంలో నన్ను ఆవేశ పడొద్దు అని చెప్పి నువ్వు ఎందుకు ఆవేశపడుతున్నావు. కోపంలో ఎంత పెద్ద నిజాన్ని బయటపెట్టబోయావో తెలుసా నీకు అంటూ కొడుక్కి నచ్చ చెప్తుంది అపర్ణ. అలా అని వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా నేను భరించలేకపోతున్నాను అంటాడు రాజ్. కొన్ని కావాలంటే కొన్ని భరించక తప్పదు.

29

కావ్యది తప్పు అని తెలిసినప్పుడు తనే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అప్పటివరకు భరించు. అలాగే ఈ విషయం తాతయ్య వాళ్లకి తెలియనివ్వకు తెలిస్తే కావ్య కే సానుభూతిని చూపిస్తారు అంటుంది అపర్ణ. మరోవైపు కనకం ఫోన్ చేసేసరికి కంగారుపడుతుంది మీనాక్షి. మళ్లీ నేను కొంప ముంచడానికి ఫోన్ చేసిందో లిఫ్ట్ చేయకపోతే మళ్లీ ఇంటికి వచ్చేస్తుంది అనుకుంటూ భయంగానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.

39

కావ్యకి 16 రోజుల పండుగ నీ చేత్తోనే చేయించాలి అంటూ సెంటిమెంటు తో కొడుతుంది కనకం. రాక చస్తానా అంటూ చెల్లెల్ని తిట్టుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది మీనాక్షి. మరోవైపు ఇంట్లో అందరూ గుడికి వెళ్తారు రాహుల్ ని రప్పించుకొని అతనితో మాట్లాడాలి అని ప్లాన్ వేసుకుంటుంది స్వప్న. ఇంట్లో అందరూ ఉన్నారో లేదో అని చూడ్డానికి బయటకు వస్తుంది.
 

49

అనుకోకుండా తల్లిదండ్రులకి ఎదురుపడుతుంది. శుభమా అని శుభకార్యానికి వెళ్తుంటే అపశకునం ఎదురొచ్చింది అంటూ స్వప్నని చివాట్లు పెడుతుంది కనకం. మీ చేత పదేపదే మాటలు పడటానికి నేనేమీ సిగ్గులేని దాన్ని కాదు అంటుంది స్వప్న. సిగ్గులేని పని చేసి వచ్చి మళ్ళీ సిగ్గు గురించి మాట్లాడుతుంది.. పెట్టింది తిని ఒక మూలన పడుండు అంటుంది కనకం. మీతో ఇలా మాటలు పడి పడి ఒక రోజు ఏదో ఒక రోజు చస్తాను అంటుంది స్వప్న.

59

అలా బెదిరించే ఇంట్లోకి వచ్చి తిష్ట వేసింది ఈసారి చావాలని ఉద్దేశం ఉంటే బయటకు పోయి చావమను లేదంటే ఇల్లు మైలు తీరడానికి సంవత్సరం పడుతుంది అంటాడు కృష్ణమూర్తి. శుభమా అని శుభకార్యానికి వెళ్తూ చావు కబుర్లు ఎందుకు పదండి వెళ్దాము అంటుంది కనకం. అందరూ వెళ్ళిపోతున్నారు అని సంతోషపడేలోపు అప్పు నేను రాను మీరు వెళ్ళండి అంటుంది.

69

ఇంతలోనే ఏమైంది అంటుంది కనకం. తల్లికి అర్థమయ్యేటట్లుగా సైగచేస్తుంది అప్పు. అక్కకి నేను తోడుంటాను నాకు అక్క తోడు ఉంటుంది అని చెప్తుంది. అర్థం చేసుకున్న కనకం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. సడన్గా ఇలాంటివి స్టిచ్చింగ్ ఏంటి అని కంగారు పడుతుంది స్వప్న. నేనేమీ నీతో ఉండటానికి ఇక్కడ ఉండిపోలేదు ఫ్రెండ్ తో సినిమాకి ప్లాన్ చేశాను అంటుంది అప్పు. ఎంతో ఆనందపడిపోతూ నువ్వు సినిమాకు వెళ్ళినట్టు అమ్మ వాళ్ళకి చెప్పనులే జాగ్రత్తగా తలుపు వేసుకొని ఇంట్లో ఉంటాను అంటుంది స్వప్న. ఏమి యాక్టింగ్ చేస్తుంది అనుకుంటుంది అప్పు. 

79

మరోవైపు కోడలికి సారె తీసుకొని వస్తుంది అపర్ణ. మీరు నా కోసం సారి తీసుకువచ్చారంటే మీలో మార్పు వస్తుంది అంటుంది కావ్య. అలాంటి ఆశలు పెట్టుకోకు నిన్ను ఎప్పటికీ కోడలుగా అంగీకరించను. ఎలాగూ తప్పు నీదని తెలిసినప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావు అప్పటివరకు కోడలు హోదా వెలగబెట్టు అంటుంది అపర్ణ. తప్పు నాది కాదు అని తెలిసినప్పుడు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను కదా  అంటుంది కావ్య. పగటి కలలు పిచ్చివాళ్లే కంటారు. తప్పు నీకుగా నువ్వు ఒప్పుకొని ఈ ఇంట్లోంచి తలదించుకొని బయటికి వెళ్లిపోవాలి ఆ రోజు కోసం ఎదురు చూస్తాను అంటూ సారే కుర్చీ మీద పెట్టి వెళ్ళిపోతుంది అపర్ణ.

89

మరోవైపు రాజ్ కుటుంబ సభ్యులందరూ గుడికి చేరుకొని అక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి కనకం దంపతులు వస్తారు. మీనాక్షి కూడా వస్తుంది. ఇప్పుడే మా వదిన మీ గురించి అడిగింది అంటుంది రుద్రాణి. వదిన గారు బయటపడరు కానీ బంధుప్రీతి ఎక్కువే అంటుంది మీనాక్షి. మీరు ఎక్కడ వచ్చేస్తారో అని కంగారులో అడిగాను. మాకు అంత అదృష్టం కూడా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది అపర్ణ. మరోవైపు స్వప్న రాహుల్ కి ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరు కలుద్దాం రమ్మంటుంది. ఇప్పుడు రావటం కుదరదు అంటాడు రాహుల్. 

99

నువ్వు రాకపోతే నేనే వస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తుంది స్వప్న. సరే అయితే మీ ఇంట్లో కాదు కానీ లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చే కలిసి కబుర్లు చెప్పుకోవచ్చు అంటాడు రాహుల్. ఇదంతా దొంగ చాటుగా విన్న అప్పు నువ్వు కంత్రీ అని తెలుసు కానీ ఇంత దినకంత్రీ అనుకోలేదు అనుకుంటుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ కి ఫోన్ చేసి జరిగింది చెప్తుంది అప్పు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంటారు అప్పు, కళ్యాణ్. స్వప్నని అప్పు ఫాలో చేస్తుంది. రాహుల్ ని కళ్యాణ్ ఫాలో చేస్తాడు.

click me!

Recommended Stories