చైతూతో `SVP` డైరెక్టర్‌ నెక్ట్స్ సినిమా.. పెట్ల మ్యాజిక్‌, తాత సెంటిమెంట్‌ వర్కౌటైతే బొమ్మ బ్లాక్‌ బస్టరే !

Published : May 18, 2022, 11:06 PM IST

`సర్కారు వారి పాట` చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు దర్శకుడు పరశురామ్‌. తన నెక్ట్స్ సినిమాని ప్రకటించారు. నాగచైతన్యంతోనే తన తదుపరి సినిమా ఉండబోతుందని తెలిపారు. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

PREV
16
చైతూతో `SVP` డైరెక్టర్‌ నెక్ట్స్ సినిమా.. పెట్ల మ్యాజిక్‌, తాత సెంటిమెంట్‌ వర్కౌటైతే బొమ్మ బ్లాక్‌ బస్టరే !

`గీతగోవిందం`, `సర్కారు వారి పాట` (Sarkaru Vaari Paata)చిత్రాలతో టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు పరశురామ్‌ పెట్ల(Parasuram Petla). ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించినా కలెక్షన్లు బాగానే ఉండటంతో సక్సెస్‌ ఖాతాలో పడింది. దీంతో దర్శకుడు పరశురామ్‌ హిట్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన నెక్ట్స్ సినిమా ఏంటనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది. హిట్‌ తర్వాత అనేక లెక్కలు మారిపోతుంటాయి. కాంబినేషన్లు సెట్‌ అవుతుంటాయి. పాత కాంబినేషన్లు పోయి, కొత్త కాంబినేషన్లు వస్తుంటాయి. 

26

దర్శకుడు పరశురామ్‌ మాత్రం గత కాంబినేషన్‌నే కంటిన్యూ చేయబోతున్నారు. ఆయన మహేష్‌తో `సర్కారు వారి పాట` చిత్రం చేయడానికి ముందు నాగచైతన్య(Naga Chaitanya)తో సినిమాని ప్రకటించారు. మహేష్‌ సినిమా ఆఫర్‌ రావడంతో ఈ ప్రాజెక్ట్ పక్కకెళ్లింది. ఇప్పుడు దాన్ని పట్టాలెక్కించబోతున్నట్టు చెప్పారు పరశురామ్‌. ఈ సినిమాకి టైటిల్‌ని కూడా కన్ఫమ్‌ చేశారు. `నాగేశ్వరరావు` (Nageswararao)అనే టైటిల్‌ అనుకుంటున్నట్టు తెలిపారు. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎలాంటి జోనర్‌లో ఉంటుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తామన్నారు. 

36

ఇదిలా ఉంటే ఇప్పుడీ కాంబినేషన్‌పై ఆసక్తికర చర్చ నడుస్తుంది. దర్శకుడు పరశురామ్‌ ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీ చిత్రాలను తెరకెక్కించడంలో దిట. `గీతగోవిందం` వరకు ఆయన అలాంటి చిత్రాలే రూపొందించి హిట్‌ కొట్టారు. `సర్కారు వారి పాట`తో కమర్షియల్‌ జోనర్‌లోకి వెళ్లారు. ఈ కథని బట్టి తాను మారినట్టు తెలిపారు. కానీ తన మీటర్‌ని వదలనని తెలిపారు. అయితే కథలను బట్టి కొన్ని సార్లు మార్పులు తప్పవని చెప్పారు. 
 

46

దీంతో ఇప్పుడే నాగచైతన్యతో చేయబోయే సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. నాగచైతన్య కెరీర్‌లో బ్లక్‌బస్టర్స్ అన్నీ ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ చిత్రాలు. రొమాంటిక్‌ కామెడీ(రామ్‌కామ్‌) చిత్రాలు బాగా వర్కౌట్‌ అయ్యాయి. `ఏం మాయ చేసావె`, `100%లవ్‌`, `మనం`, `మజిలి`, `లవ్‌ స్టోరీ` వంటి సినిమాలన్నీ మంచి రొమాంటిక్‌, లవ్‌, కామెడీ సినిమాలు. దర్శకుడు పరశురామ్‌కి కూడా ఇలాంటి సినిమాలు చేయడంలో దిట్ట. పైగా ఇప్పుడు కమర్షియల్‌ యాంగిల్‌ని కూడా పట్టుకున్నారు. దర్శకుడిగా ఆయన పరిణతి కూడా పెరిగింది. రేంజ్‌ కూడా పెరిగింది. దీంతో చైతూతో సినిమా భారీ స్థాయిలోనే ఉండబోతుందని చెప్పొచ్చు. 

56

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి `నాగేశ్వరరావు` అనే టైటిల్‌ అనుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికైతే మార్పులు ఏం లేవన్నారు. అదే టైటిల్‌ అయితే తాత సెంటిమెంట్‌ కలిసొచ్చే అంశం. తాత సెంటిమెంట్‌తో చేసిన `మనం` బ్లాక్‌ బస్టర్‌. అలాంటిది ఇప్పుడు చేస్తే దాన్ని రేంజ్‌ మరింతగా ఉండబోతుంది. దీంతోపాటు ఇటీవల చేసిన `బంగార్రాజు`లో తాత సెంటిమెంట్‌ బాగా వర్కౌట్‌ అయ్యింది. ఇప్పుడు దాన్నే ఇంప్లిమెంట్ చేస్తే, పరశురామ్‌ సినిమాకి కలిసొచ్చే అంశం. అక్కినేని అభిమానుల్ని మరింతగా ఆకట్టుకునే అంశంగా నిలుస్తుంది. దీంతో ఏఎన్నార్‌ అభిమానులు సైతం ఈ సినిమా కోసం కదులుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది కూడా సినిమాకి కలిసొచ్చే అంశం. 
 

66

మొత్తంగా పరశురామ్‌ పెట్ల మ్యాజిక్‌(ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీ, రామ్‌కామ్‌), తాత(ఏఎన్నార్‌) సెంటిమెంట్‌ కలిస్తే ఇక వెండితెరపై బొమ్మబ్లాక్‌ బస్టరే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కెరీర్‌ పరంగా చైతూ రేంజ్‌ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం చైతూ `థ్యాంక్యూ`, హిందీలో `లాల్‌సింగ్‌ చద్దా` చిత్రాలు చేస్తున్నారు. ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories