కొత్త ప్రియుడ్ని పక్కన పెట్టి.. మాజీ ప్రియుడితో సుస్మితా సేన్ డేటింగ్, పాపం లలిత్ మోడీ అంటున్న నెటిజన్లు

First Published | Aug 28, 2022, 10:18 PM IST

మాజీ విశ్వసుందరి .. బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌  ఈమధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్‌ క్రియేటర్ లలిత్ మోడీతో ప్రేమలో పడ్డ ఈ బ్యూటీ.. రకరాల వార్తలతో ఎప్పుడూ న్యూస్ ఐటమ్ గా మారుతూనే ఉంది. కొత్త ప్రియుడు లలిత్ మోడీని వదిలేసి.. సుస్మిత పాత ప్రియుడిని వెంటేసుకుని తిరుగుతూ.. అందరిని ఆశ్చర్యపరుస్తోంది.  

లాస్ట్ డిసెంబర్ లో తనకంటే చిన్నవాడైన తన  రెండో ప్రియుడుడితో బ్రేకప్ చెప్పిన సుస్మితా సేన్ .. లలిత్ మోడీతో జతకట్టింది.  తామిద్దరం ప్రేమలో ఉన్నామని, త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు  లలిత్‌ మోడీ కూడా ప్రకటించారు. వీరి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాి. 
 

ఈ ఇద్దరు తారల డేటింగ్‌పై సోషల్‌ మీడియా భారీగా డిస్కర్షన్లు జరిగాయి. అయితే తాజా న్యూస్ ఏంటీ అంటే ...సుస్మితా సేన్ లలిత్ మోడీకి హ్యాండ్ ఇచ్చిందా..? లేక ఆమె  డబుల్ గేమ్ ఆడుతుందా అని నెటిజన్లు అనుమానం వ్యాక్తం చేస్తున్నారు. లలిత్ మోడీతో ప్రేమలో ఉన్న ఆమె.. రీసెంట్ గా రెండు మూడు సార్లు,.. తన మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కింది. దాంతో ఈ న్యూస్ నెట్టింట్ట తెగ వైరల్ అవుతోంది. 


బాలీవుడ్‌ నటి సుష్మితా సేన్‌ వృత్తిపరమైన విషయాలకంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీతో లవ్‌లో పడ్డనాటి నుంచి సుష్మిత ప్రతి కదలిక మీద కన్నేసారు నెటిజన్లు. ఈ క్రమంలో పలుమార్లు తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రోహ్మన్‌ షాతో షాపింగ్‌లు, సినిమాలకు వెళ్లడం చూసి ముక్కున వేలేసుకున్నారు. కొందరు మాత్రం బ్రేకప్‌ తర్వాత ఫ్రెండ్స్‌గా ఉండకూడదా? ఏంటని సుష్మితను సపోర్ట్‌ చేస్తున్నారు.
 

తాజాగా ఈ నటి తన కూతురు రినీ సేన్‌, మాజీ ప్రియుడు రోహ్మన్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా కెమెరా కంట పడ్డ ఈ బ్యూటీ రినీ, రోహ్మన్‌తో కలిసి ఫొటోలను పోజులిచ్చింది. కూతురు అలిషా బర్త్‌డే కోసం షాపింగ్‌ చేస్తున్నామని వెల్లడించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. 

 సుస్మితను ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్నారు నెటిజన్లు .. నువ్విలా నీ మాజీతో తిరుగుతుంటే అది చూసిన లలిత్‌ మోదీ ఏమైపోవాలి...  అని కొందరు.. అబ్బా.. వాళ్లిద్దరూ ఒకప్పుడు లవర్స్‌, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్‌ అని మరికొందరు  కామెంట్లు చేస్తున్నారు. అయితే సుష్మిత ఇవేమి పట్టించుకోకుండా.. తన ఎక్స్ తో కలిసి ఫుల్ గా తిరిగేస్తోంది. 

ఆమధ్య  లాల్‌ సింగ్‌ చద్దా మూవీ  ప్రీమియర్  సందర్భంగా కూడా  సుష్మితా సేన్  తన పెంపుడు  పిల్లలతో పాటు  కలిసి వచ్చింది. అయితే వారితో పాటు ఆమె మాజీ ప్రియుడు రోహ్మాన్‌ షాల్‌ కూడా ఉన్నాడు.  ఈ వీడియో అప్పుడే తెగ వైరల్ అయ్యింది. సుస్మితా కొత్త ప్రియుడితో కాకుండా పాత ప్రియుడితో సినిమాకొచ్చిందేమిటి అని ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు షాపింగ్ కు కూడా పాత ప్రియుడినే వెంటపెట్టుకుని రావడంతో.. పాపం లలిత్ మోడీ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. 

గతంలో మాజీ క్రికెటర్ తో ప్రేమలో మునిగి తేలిన సుస్మితా సేన్.. అతనికి బ్రేకప్ చెప్పి..  తనకంటే చిన్నవాడైన రోహ్మాన్‌ తో  కొన్నేళ్ల డేటింగ్‌ చేసింది.  గత డిసెంబర్‌లో వీరి బంధం కూడా  బ్రేకప్‌ అయ్యింది. సుస్మిత లలిత్ మోడీకి కనెక్ట్ అయ్యింది. అయితే ట్విస్ట్ ఏంటీ అంటే  బ్రేకప్ తరువాత కూడా వీరు తరచు కలుస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఆగస్ట్‌ 8న జరిగిన  సుష్మితా తల్లి బర్త్‌డే వేడుకులో కూడా రోహ్మాన్‌  సందడి చేశారు.  

Latest Videos

click me!