అయ్య బాబోయ్.. చూపుల్తోనే హార్ట్ బీట్ పెంచేస్తుందే.. టాటూ చూపిస్తూ అట్రాక్ట్ చేస్తున్న ప్రియాంక మోహన్..

First Published | Jul 30, 2022, 7:30 PM IST

తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. అలాగే రెగ్యూలర్ గా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిస్తూ సోషల్ మీడియాలో తన మార్క్ చూపిస్తోంది. 

కోలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతోంది. 
 

సినిమాల్లోనే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు చాలా దగ్గరగా ఉంటోంది. అదిరిపోయే ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తున్న ఈ భామా తాజాగా తన నయా లుక్ తో ఆకట్టుకుంటోంది. 
 


తాజాగా తమిళ హీరోయిన్ ప్రియాంక తన అభిమానులతో పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  పట్టుచీరలో తెలుగమ్మాయిలా కనిపిస్తూ కనువిందు చేస్తోంది. అదిరిపోయే స్టిల్స్ తో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. ట్రెడిషనల్ లుక్ తోనే నెటిజన్లను కట్టిపడేస్తోంది.
 

అదేవిధంగా తన మెడ భాగంలో ఉన్న టాటూను చూపిస్తూ మురిసిపోయింది. అందమైన మెడపై ఉన్న ఆ టాటూ తన అభిమానులను, ఫాలోవర్స్ ను ఫిదా చేస్తోంది. ఈ ట్రెడిషనల్ బ్యూటీ పంచుకున్న పిక్స్ ను నెటిజన్లు సైతం లైక్ చేస్తున్నారు. అందాల సుందరి అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు. 

ప్రియాంక మోహన్ కూడా గ్లామర్ షోలో హద్దులు దాటడం ఇంత వరకు చూడలేదు. తన లిమిట్స్ లోనే క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంటోంది. తనదైన శైలిలో ఫాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. అభిమానులు ఈ బ్యూటీ ప్రవర్తనకు ఖుషీ అవుతున్నారు.

నేచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. తమిళ సినిమాల డబ్డ్ వెర్షన్ లోనూ తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇటీవల తమిళ స్టార్ సూర్య నటించిన ‘ఈటీ’తో  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ‘డాన్’లో మెరిసింది. ప్రస్తుతం ఈ సుందరి లిస్ట్ లో మరే చిత్రాలు లేవు. 

Latest Videos

click me!